జనం సొమ్ముతో జల్సాలు చేయడమంటే జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్‌కు మహా సరదానా? ముక్కు పిండి వసూలు చేసే పన్నుల డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడానికి పోటీలు పడుతున్నారా? ఇంకో 40 రోజుల్లో పదవి నుంచి దిగిపోయే కార్పొరేటర్స్ ఏం వెలగబెడదామని, ఎవర్ని ఉద్ధరిద్దామని స్టడీ టూర్స్ వేయబోతున్నారు? అవి స్టడీ టూర్సా? లేక ఫైనల్ స్టేజ్‌లో వేసే జాలీ ట్రిప్సా? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో స్టడీ టూర్‌కు రంగం సిద్ధమవుతోంది. జనవరి నాలుగు నుంచి…
ఆమె తన మేనమామే కదా అని వదిలేసినట్టుంది. ఆయనేమో తన మేనకోడలు ఎమ్మెల్యే అంటూ తెగ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గానికి తానే కింగ్ మేకర్ అంటూ పోజులు కొడుతున్నారు. మరి…అక్కడ కోడలు ఎమ్మెల్యే అయితే మామ పెత్తనమే కొనసాగుతోందా? వందా యాభై చందాల నుంచి మొదలుపెట్టి రాజకీయ దందాలు చేస్తున్నదెవరు?ఇంతకీ…ఎవరా మామా కోడళ్లు?ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరే ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల వేళ అనూహ్యంగా…
మంత్రుల గొంతు మూగబోయిందా?పార్టీ, ప్రభుత్వంపై ఆ రేంజ్లో విపక్షం విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా?అప్పోజిషన్ గ్యాప్ కూడా ఇవ్వకుండా సర్కార్‌పై ఎటాక్ చేస్తుంటే వీళ్లంతా మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారు?చెప్పుకోవడానికి ఊరంతా బలగమే ఉన్నా…అసలు ఉపయోగమే లేకుండాపోయిందా?రాజకీయ పదవులు అనుభవిస్తూ…పెదవులు మూసుకున్న ఆ నేతలెవరు? మాకెందుకు..తిట్టింది మమ్మల్ని కాదుగా అనుకుంటున్నట్టున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలా అని తనదాకా వస్తే మాత్రం…చూశారా?ఎవరు మద్దతుగా లేరు అని అనుకోవడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందట. కాంగ్రెస్ పార్టీ…
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా?పార్టీ అధికారంలోకి వచ్చినా…ఇప్పటి వరకు హైకమాండ్ వాళ్ల వైపు ఎందుకు చూడలేదు?గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవటానికి కారణం ఏంటి?జనం కోసం కేసులు, కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా?పార్టీ అధికారంలోకి రావటానికి కీలకమైన ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి…సొంత వాళ్లను ఎందుకు వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు…
అక్కడ నీళ్ళలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్ డ్యామ్‌తో పరస్పరం చెక్ పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు మొదలు పెట్టిన గేమ్ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్? ఎవరు ఎవరికి చెక్‌మేట్? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటు పోతోంది? దోషులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతోపాటు రైతులకు సాగు నీరు ఇచ్చేందుకు గతంలో చెక్ డ్యామ్‌లు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు…
మాటకు మాట కాదు…. ఒకటికి రెండు మాటలతో సమాధానం చెప్పబోతున్నారా? ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇప్పటికే హద్దులన్నీ చెరిగిపోగా… ఇక నుంచి డోస్ డబుల్ చేయాలని బీఆర్ఎస్ డిసైడైందా? కవిత మీద ఇన్నాళ్ళు చేసిన విమర్శలు ఒక లెక్క, ఇక నుంచి చేయబోయేవి మరో లెక్కగా మారబోతోందా? ఈ మాటల యుద్ధంలో టాప్ సీక్రెట్స్ కూడా బయటపడబోతున్నాయా? లెట్స్ వాచ్. నువ్వు తమలపాకుతో ఒకటంటే… నేను తలుపు చెక్కతో నాలుగంటాను అన్నట్టుగా మారిపోయింది ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్…
వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతోందా? అందుకోసం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగిపోతోందా? కొత్తగా రాజకీయ ప్రవేశం చేయబోతున్న ఆ వారసులు ఎవరు? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? అసలు ప్లానింగ్ ఏంటి? ఆశాకిరణ్…. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తళుక్కుమంటున్న సరికొత్త కిరణం. రాజకీయాల దిశగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి అభిమానులు ఉన్నారు. రంగా…
ఆదోని జిల్లా విషయంలో కొత్త డ్రామాకు తెర లేస్తోందా? సీఎం చంద్రబాబు సైతం పరిశీలించమని చెప్పినా…. మొత్తం మేటర్ని పక్కదారి పట్టించే ఎత్తుగడలు నడుస్తున్నాయా? కూటమిలో… అందులోనూ… తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి? అందరి అభిప్రాయాలకు భిన్నంగా మోకాలడ్డుతున్న ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలో… మెల్లిగా అది కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నట్టు కనిపిస్తోంది. వాళ్ల వ్యవహారం మొత్తం ఉద్యమాన్నే…
ముగ్గురు మంత్రులు, అదీ…. ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోల్లో ఉన్న వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? మంత్రులు గ్లోబల్ సమ్మిట్ బిజీలో ఉంటే… అక్కడ లోకల్‌గా పార్టీ వ్యవహారాలను ఎవరు చక్కబెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు వాతావరణం ఎలా ఉంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాగే…మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పక్షానివే. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యే, అటు భద్రాచలంలో బీఆర్ఎస్…
పంచాయతీ పోరు ఆ ఎంపీలకు ప్రెస్టీజ్ ఇష్యూ అయిందా? అందుకే ఆఫర్స్ మీద ఆఫర్స్…. బంపరాఫర్స్ అంటూ పల్లె ఓటర్స్‌ను టెంప్ట్ చేస్తున్నారా? మేటర్ చివరికి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ హామీ దాకా వెళ్ళిపోయిందా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఏ పార్టీ ఎంపీలు అలా హామీల వరద పారిస్తున్నారు? తెలంగాణలో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా జరుగుతోంది. ఇవి పార్టీలకు అతీతమైన ఎన్నికలైనా, ఆ సింబల్స్‌తో సంబంధం లేకున్నా…. అన్ని పార్టీల కేడర్ హడావిడి మాత్రం తగ్గడం…