తెలంగాణ బీజేపీలో స్తబ్దత బాగా… పేరుకుపోయిందా? దాన్ని వదలగొడితేనే… స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటగలమని రాష్ట్ర నాయకత్వం డిసైడైందా? అందుకోసం స్పెషల్ స్కెచ్‌లు సిద్ధం చేస్తోందా? కేడర్‌లో ఊపు ఉత్సాహం తీసుకు రావడం ద్వారా… తాను మాటలు కాదు, చేతల మనిషిని అని కొత్త అధ్యక్షుడు నిరూపించుకోవాలనుకుంటున్నారా? ఇంతకీ కొత్త ప్లానింగ్ ఏంటి? అందుకోసం జరుగుతున్న కసరత్తు ఏంటి? తెలంగాణ బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పుడాయన ముందున్న లక్ష్యం కూడా చిన్నదేం కాదు. వచ్చే…
ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారు..? బనకచర్ల సవాళ్ళ పర్వంలో పైచేయి కాంగ్రెస్‌దా? బీఆర్ఎస్దా? అసెంబ్లీకి రావడం కేసీఆర్‌కు ఇష్టం లేకుంటే… నేనే ఫామ్‌హౌస్‌కి వస్తానని చెప్పడం ద్వారా సీఎం రేవంత్… మేటర్ని తనవైపునకు తిప్పుకున్నారా? రేవంత్ సవాల్‌కు గులాబీ పార్టీ సమాధానమేంటి? ఈ సవాళ్ళ పర్వంలో ఎవరి వెంట ఎవరు నడుస్తున్నారు? తెలంగాణ రాజకీయం మొత్తం గడిచిన వారం రోజులుగా… సవాళ్లు, ప్రతి సవాళ్ళ చుట్టూనే తిరుగుతోంది. తగ్గేదే లే అన్నట్టు అధికార, ప్రతి పక్షాల నేతలు…
ఈ నెల 9న చిత్తూరులో జగన్ పర్యటన: చిత్తూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే, ఇప్పటికే హెలిప్యాడ్ కు అనుమతిచ్చిన…
బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు: బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని తెలిపారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇకపై కూడా చెప్పను అని చెప్పారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే…
గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆలయం ముందురున్న చలువ పందిళ్లు అంటుకున్నాయి. మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటి వచ్చి పరుగులు తీశారు. స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి…
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట: సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం విచారించిన ధర్మాసనం.. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని తెలిపింది. సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తమ…
2 రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నేడు జైలు…
నేడు, రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసి ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకోనున్న సీఎం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్టీ సమావేశం.. అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు జైలు నుంచి విడుదల కానున్న వల్లభనేని వంశీ.. 138 రోజులుగా జైల్లో ఉన్న వంశీ.. 11 కేసుల్లో వంశీకి బెయిల్.. చివరి కేసులో నిన్న బెయిల్ ఇచ్చిన నూజివీడు కోర్టు లిక్కర్ స్కాం…
గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట: గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట లభించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలలో జీవీఎంసీ గడువు కావాలని కోరింది. వర్కర్స్ డిమాండ్లను బుధవారం లోపు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జీవీఎంసీ మాట తప్పితే.. శుక్రవారం నుంచి తిరిగి నిరవధిక సమ్మెకు వెళతాం అని యూనియన్లు హెచ్చరించాయి. తాత్కాలిక సమ్మె విరమణతో కాంట్రాక్ట్…
విశాఖ నగరానికి మంచినీటి ముప్పు: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడంతో.. విశాఖ నగర వాసులు నానా అవస్థలకు గురవుతున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధుల బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు…