Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
- పది విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం..
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అవకాశం..
- రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హాజరు కానున్న 6.42 లక్షల మంది విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) భారీ ఊరటనిచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది.
హాల్ టికెట్ చూపిస్తే చాలు..
ఈ సౌకర్యం పొందడానికి విద్యార్థులు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. తమ వెంట ఉన్న పరీక్ష హాల్ టికెట్‌ను బస్సు కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. తమ నివాస ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి.. తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు.
Also Read
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Also Read:AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..
పరీక్షల సమయంలో విద్యార్థులు ఆలస్యంగా వెళ్లకుండా ఉండేందుకు ఆర్టీసీ ఎండీ (MD) ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరిగే సమయాల్లో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని, విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను కూడా నడపాలని రీజనల్ మేనేజర్లకు సూచించారు. పరీక్ష సమయానికి కనీసం గంట ముందే బస్సు స్టాప్‌కు చేరుకోవడం ఉత్తమం.
Also Read:Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
హాల్ టికెట్ ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండాజజ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే భరోసా లభిస్తుంది. పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!