సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన…
ఇండియాలో సూపర్బ్ గా డాన్స్ చేయగల హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంది. ఎలాంటి స్టెప్ నైనా వేయగల ఈ ఇద్దరిలో… చరణ్ బలం ‘గ్రేస్’ అయితే ఎన్టీఆర్ ‘స్పీడ్’. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాదు భారతదేశం ఊగిపోతుందని నిరూపించింది ‘నాటు నాటు’ సాంగ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’…
ఒక హిట్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు రాబట్టింది అని లెక్కలు వేసే వాళ్లు. బాహుబలి సీరీస్ తర్వాత హిట్ సినిమా ఎంత రాబట్టింది అనే దాని గురించి మాట్లాడాలి అంటే ‘బాహుబలి సీరీస్’ని వదిలిపెట్టి మాట్లాడాల్సి వస్తోంది. దీంతో ఏకంగా ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అనే కొత్త పేరుని క్రియేట్ చేసుకోని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాగే ఇకపై ఒక సినిమా ఎన్ని అవార్డులు గెలుచుకుంది అనే…
కొరటాల శివ రైటింగ్ స్టైల్ కి ఒక ఇమేజ్ ఉండేది. కమర్షియల్ సినిమాలు అంటే రొట్ట మాస్ ఫైట్స్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ ని కూడా కలిపి బాక్సాఫీస్ దెగ్గర సెన్సేషనల్ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించాడు. అందుకే కొరటాల శివని కమర్షియల్ సినిమానే మార్చిన వాడిగా చూశారు ఆడియన్స్. అలాంటి కొరటాల శివ రైటింగ్ కి, మేకింగ్ కి నెగటివ్ కామెంట్స్ తెస్తూ ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారి అంచనాల మధ్య వచ్చిన…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేసే హీరో లేడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా అద్భుతంగా, అనర్గళంగా చెప్పగలిగే ఎన్టీఆర్ ఇప్పుడో టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతంలో రామ్ పోతినేని నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న #SDT15 టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్ప్స్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని…
SDT 15: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. ఇక ఆరు నెలల రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే తేజ్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్ ని ఎంజాయ్ చెయ్యని ఆడియన్స్ కూడా ఉండరు. అందుకే ఎన్టీఆర్ లు త్రివిక్రమ్ లు కలిసి ఒక్క సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు కోరుకున్నారు. ఆ కోరికని నిజం చేస్తూ వచ్చిన సినిమానే ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్…
దర్శక ధీరుడు రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లభించింది. ఆస్కార్ బరిలో నిలవడానికి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న టైంలో ‘జక్కన్న’కి ఈ అవార్డ్ రావడం కలిసొచ్చే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ‘నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’ లాంటి అసోసియేషన్ నుంచి అవార్డ్స్ రావడం చాలా ముఖ్యం. ఇది ఆర్ ఆర్ ఆర్…
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ను మోసం చేశాడు కాబట్టే.. చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి శాపం పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు వయసులో ఉన్న జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి మానసికంగా చంద్రబాబు క్షోభ పడేలా దేవుడు చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడని.. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని పేర్ని నాని…
NTR 31: ఇప్పటివరకూ అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇండియన్ సినిమా ఏదైనా ఉందా అంటే ఈ మూవీనే. ఫైర్ హౌస్ ల్లాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లు కలిసి సినిమా చేస్తున్నాం అనగానే పాన్ ఇండియా రేంజులో బజ్ క్రియేట్ అయ్యింది. మే 20న మైత్రి మూవీ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ పోస్టర్ ఎప్పుడైతే బయటకి వచ్చిందో ‘ఎన్టీఆర్ 31’ మూవీ పాజిటివ్ వైబ్స్ ని స్ప్రెడ్ అయ్యేలా చేసింది. 2023 మార్చ్ నుంచి సెట్స్…