Nitish Kumar: రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రకటించిన బిహార్ సీఎం.. ప్రస్థానం చూస్తే పరేషాన్ కావాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం అప్రతిహతం. సీఎం కుర్చిపై ఇప్పటి వరకు 10 సార్లు కూర్చున్న ఆయన ఒక్కసారిగా తన ముఖ్యమంత్రి పదవికి బాయ్‌బాయ్ చెప్పి రాష్ట్ర ప్రజలతో పాటు, యావత్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తాజా నిర్ణయంతో ఆయన ఈ రాజకీయ చదరంగంలో కొత్త పావును కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. బీహార్ సీఎం నితీష్ కుమార్. కొన్ని నెలల క్రితం, ఆయన రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ స్టోరీలో ఆయన రాజకీయ జీవితాన్ని తెలుసుకుందాం.
READ ALSO: PM Modi: సైనిక సంఘర్షణతో సమస్య పరిష్కారం కాదు.. యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
నితీష్ కుమార్.. బీహార్ రాజకీయాల్లో మకుటం లేని మహారాజు. కూటమి ఏదైనా ఆయన సీఎం కుర్చిపైన ఉండాల్సిందే. ఆయనకు జట్టు మారడంలో ఏమాత్రం జంకడనే పేరుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆయన ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా, రికార్డు స్థాయిలో 10 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన శాసనమండలి సభ్యుడిగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన బీహార్ ముఖ్యమంత్రి పదవిని అలరించి, ప్రజలను పాలించారు. బీజేపీ- జేడియూ, ఆర్జెడి-జేడియూలతో కూడిన మహా కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించారు. నితీష్ కుమార్ భార్య మంజు కుమారి సిన్హా. వృత్తిరీత్యా ఆమె ఉపాధ్యాయురాలు. మంజు కుమారి సిన్హా మే 14, 2007న న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. వారి కుమారుడు నిశాంత్ కుమార్ త్వరలో ఎమ్మెల్సీగా ఎన్నికై రాజకీయాల్లోకి వస్తారని అందరూ చర్చించుకుంటున్నారు.
నితీష్ కుమార్ రాజకీయ జీవితం ఇదే..
* 1985 – మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు
* 1989 – మొదటిసారి ఎంపీ అయ్యారు (ఆరుసార్లు ఎంపీ – లోక్‌సభ)
* 1990 – మొదటిసారి మంత్రి అయ్యారు
* 2000 – మొదటిసారి ముఖ్యమంత్రి (బీహార్) అయ్యారు
* 2006 – మొదటిసారి బీహార్ శాసనమండలి (MLC) సభ్యుడయ్యారు
నితీష్ కుమార్ రికర్డు స్థాయిలో బీహార్ ముఖ్యమంత్రిగా 10 సార్లు ఎన్నికయ్యారు..
నితీష్ కుమార్ రాజకీయ ఇన్నింగ్స్..
* 1985-89: బీహార్ శాసనసభ సభ్యుడు, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
* 1987-88: యువ లోక్‌దళ్ అధ్యక్షుడు, బీహార్.
* 1989 – 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు, మొదటిసారి ఎంపీ అయ్యారు.
* 04/1990-11/1990: వ్యవసాయం, సహకార శాఖ కేంద్ర మంత్రిగా పని చేశారు.
* 1991 – 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ సారి)
* 1991-93: జనరల్ సెక్రటరీ – జనతాదళ్ కార్యదర్శి, పార్లమెంటులో జనతాదళ్ డిప్యూటీ లీడర్
* 1996: 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వ సారి)
* 1998: 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (4వ సారి)
* 19/3/98 – 5/8/99: కేంద్ర క్యాబినెట్ మంత్రి, రైల్వేలు
* 14/4/98 – 5/8/99: కేంద్ర క్యాబినెట్ మంత్రి, ఉపరితల రవాణా (అదనపు ఛార్జ్)
* 1999: తిరిగి ఎన్నికయ్యారు 13వ లోక్‌సభ (5వ సారి)
* 13/10/99 – 22/11/99 – కేంద్ర క్యాబినెట్ మంత్రి, ఉపరితల రవాణా
* 22/11/99 – 3/3/2000 – కేంద్ర క్యాబినెట్ మంత్రి, వ్యవసాయం
* 27/5/00 – 20/3/01: కేంద్ర క్యాబినెట్ మంత్రి, వ్యవసాయం
* 20/3/01- 21/7/01: కేంద్ర క్యాబినెట్ మంత్రి, వ్యవసాయం, రైల్వేల అదనపు బాధ్యత
* 22/7/01- 21/5/04: కేంద్ర క్యాబినెట్ మంత్రి, రైల్వేలు
* 2004 – 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (6వ సారి)
రాజ్యసభ ఎన్నికల వేళ అనూహ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇకపై సీఎంగా ఉండనని, రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన కొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!