యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేసే హీరో లేడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా అద్భుతంగా, అనర్గళంగా చెప్పగలిగే ఎన్టీఆర్ ఇప్పుడో టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతంలో రామ్ పోతినేని నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న #SDT15 టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్ప్స్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. “More love to you Tarak. Thank you is a small word for the way you received me when I came to you. It felt like the old days when I came to meet you before becoming an actor. Your voice has made our #SDTitleGlimpse magical #NTRforSDT will always be special for me” అంటూ సాయి ధరమ్ తేజ్ కోట్ చేశాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ #SDT15 సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకూ చేయని పాత్రలో కనిపిస్తాడని, కథ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
తేజ్ సినిమాకి ఎన్టీఆర్ సపోర్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు… గతంలో ఈ మెగా మేనల్లుడు నటించిన ‘జవాన్’ సినిమా ఓపెనింగ్ కూడా వచ్చిన ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్ తో చాలా సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. ఈ ఇద్దరి మధ్య ఇంతమంచి స్నేహం ఉందనే విషయం అందరికీ తెలిసింది కూడా ఆ రోజే. తేజ్, వినాయక డైరెక్షన్స్ లో నటించిన ‘ఇంటెల్లిజెంట్’ సినిమా ఓపెనింగ్ కి బాలయ్యకి వచ్చి చిత్ర యూనిట్ ని అభినందించాడు. ఈ కారణాల వలన మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరి కన్నా, సాయి ధరమ్ తేజ్ అంటే నందమూరి అభిమానులకి ప్రత్యేకమైన అభిమానం. ఇంకో విశేషం ఏంటంటే ఎన్టీఆర్ చరణ్ నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా గురించి అందరికన్నా ముందే లీక్ చేసిన వాడు సాయి ధరమ్ తేజ్. చరణ్, ఎన్టీఆర్ రాజమౌళిలు కలిసి దిగిన ఫస్ట్ ఫోటోని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
More love to you Tarak @tarak9999 ❤️
Thank you is a small word for the way you received me when I came to you.
It felt like the old days when I came to meet you before becoming an actor.Your voice has made our #SDTitleGlimpse magical#NTRforSDT will always be special for me 🤗 pic.twitter.com/UxYhXSbNE7
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 5, 2022