ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచే దారిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. జక్కన్న చెక్కిన ఈ మాస్టర్ పీస్ హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు, సినీ మేధావులని సైతం ఫిదా చేస్తూ అక్కడి అవార్డ్స్ ని సొంత చేసుకుంటూ రోడ్ టు ఆస్కార్స్ అంటోంది. రీసెంట్ గా ‘న్యూయార్క్ ఫిల్మ్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్’ని రాజమౌళి గెలుచుకోని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ‘ఆర్ ఆర్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ’ని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ‘స్పాట్ లైట్ అవార్డ్ విన్నర్’గా ప్రకటించింది. ఫిబ్రవరి 24న జరగనున్న HCA ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర యూనిట్ కి ‘స్పాట్ లైట్ అవార్డ్’ని ఇవ్వనున్నారు.
తాజాగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డ్ వచ్చి చేరింది. ‘లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’లో బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో కీరవాణికి అవార్డ్ లభించింది. ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ కి నామినేట్ అవుతుంది అనే వార్త వినిపిస్తున్న సమయంలో కీరవాణికి ‘లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డ్ రావడం మంచి విషయం. ఈ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో రాజమౌళి రన్నర్ అప్ గా నిలిచారు. ‘టార్’ సినిమాకి గాను ‘టోడ్ ఫీల్డ్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు. రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వచ్చి ఉంటే బాగుండేది కానీ ఒక ఇండియన్ సినిమా అంత దూరం వెళ్లడమే చాలా గొప్ప విషయం. ఇప్పటివరకూ ఇండియన్ సినిమా చేరుకోలేకపోయిన ఎన్నో చోట్లకి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా వెళ్తోంది. ఇదే జోష్ లో ఆస్కార్ వరకూ వెళ్లి ఒక్క కేటగిరిలో ఆస్కార్ ని ఇండియాకి తెచ్చినా జక్కన్న అండ్ టీం దేశం గర్వించదగ్గ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే.