సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన షాట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. గ్లిమ్ప్స్ ఎండ్ లో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ఇంటెన్స్ ఎపిసోడ్ నుంచి ఈ ‘విరూపాక్ష’ గ్లిమ్ప్స్ ని కట్ చేశారు. మంచి విజువల్స్ ని, ది బెస్ట్ గా మార్చింది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.
ఎన్టీఆర్ వాయిస్ లో ఉండే మ్యాజిక్ ‘విరూపాక్ష’ గ్లిమ్ప్స్ ని బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ‘అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢనమ్మకానికి మూలం, ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు, అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అనే డైలాగ్ ఎన్టీఆర్ బేస్ వాయిస్ లో చెప్తుంటే ‘విరూపాక్ష’ టైటిల్ రివీల్ అయ్యింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వచ్చే టైంలో చూపించిన విజువల్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. మొత్తానికి ‘విరూపాక్ష’ కోసం మూఢనమ్మకం చుట్టూ తిరిగే కథని సాయి ధరమ్ తేజ్ ఎంపిక చేసుకున్నట్లు ఉన్నాడు. ఈ మూవీని 2023 ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. యూనివర్సల్ కంటెంట్ అవ్వడంతో మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తున్నట్లు ఉన్నారు. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం ‘విరూపాక్ష’ సినిమా నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది.