NTR: వస్తున్నా అని వెళ్తున్నావ్? ఇంకెన్ని రోజులు తారక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ కోసం ఫారిన్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చిన ఫోటోస్ లో ఎన్టీఆర్ బియర్డ్ లుక్ లో కనిపించాడు. నెల రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేసి, సంక్రాంతి ముందు తిరిగి ఇండియా రానున్నాడని సమాచారం. నెల రోజుల పాటు ఎన్టీఆర్ ఇండియాలో ఉండడు అనే విషయం తెలియగానే తారక్ ఫాన్స్ నీరస పడిపోయారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన #NTR30 సినిమా డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్తుందని నందమూరి అభిమానులు చాలా ఆశగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తారక్ ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఎప్పుడో జూలైలో స్టార్ట్ అవ్వాల్సిన ‘ఎన్టీఆర్ 30’ సినిమా ఎందుకు డిలే అవుతుందో ఎవరికీ అంతుబట్టని విషయంగా మారింది, కొరటాల ఆచార్య రిజల్ట్ నుంచి బయటకి రాలేదా? కథలో మార్పులు చేస్తున్నాడా? లేక కథనే మార్చేసి కొత్త కథని రాస్తున్నాడా? ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ ఎంత వరకూ వచ్చింది? ఇలా ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ సమాధానం మాత్రం ఒక్కటి కూడా లేదు. జూలై సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్న సినిమా ఆ తర్వాత దసరాకి షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. ఈ రెండూ జరగలేదు, నవంబర్ నెలలో ప్రీప్రొడక్షన్ స్టార్ట్ అయినట్లు కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫోటోస్ చూసిన ఫాన్స్ ఇక ‘ఎన్టీఆర్ 30’ సెట్స్ పైకి కి వెళ్లడమే ఆలస్యమని భావించారు. ఇలాంటి సమయంలో తారక్ ఇలా ఫరిం ట్రిప్ వెళ్లడం అందరికీ షాక్ ఇస్తోంది. ఫ్యామిలీ ట్రిప్ పూర్తి చేసుకోని జనవరి నెలలో తారక్ తిరిగొస్తాడు, అప్పుడైనా ‘ఎన్టీఆర్ 30’ సెట్స్ పైకి వెళ్తుందా? అసలు ‘ఎన్టీఆర్ 30’ అనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా? మోషన్ పోస్టర్ లో ‘వస్తున్నా’ అని చెప్పిన తారక్ ఇలా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తున్నాడు. నందమూరి అభిమానులు ఇంకెన్ని రోజులు ఇలా వెయిట్ చేయాలి అనే ప్రశ్నకి కొరటాల శివ మాత్రమే ఆన్సర్ చేయగలడు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!