కొరటాల శివ రైటింగ్ స్టైల్ కి ఒక ఇమేజ్ ఉండేది. కమర్షియల్ సినిమాలు అంటే రొట్ట మాస్ ఫైట్స్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ ని కూడా కలిపి బాక్సాఫీస్ దెగ్గర సెన్సేషనల్ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించాడు. అందుకే కొరటాల శివని కమర్షియల్ సినిమానే మార్చిన వాడిగా చూశారు ఆడియన్స్. అలాంటి కొరటాల శివ రైటింగ్ కి, మేకింగ్ కి నెగటివ్ కామెంట్స్ తెస్తూ ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కొరటాల ఇమేజ్ ని దెబ్బ తీసింది. ఫ్లాప్ అనేదే తెలియని దర్శకుడు, ఒక్క డిజాస్టర్ ఇచ్చే సరికి ఆన్లైన్ ఆఫ్లైన్ లో కొరటాలని టార్గెట్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేశారు. ఈ మచ్చని చెరిపేసు కోవాలంటే కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’తో భారి హిట్ కొట్టాలి, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అప్పుడు కానీ కొరటాల శివ గురించి వస్తున్న కామెంట్స్ ఆగిపోవు.
నిజానికి ఏ దర్శకుడి గురించి అయినా ఇలాంటి విమర్శలు వస్తే, స్టార్ హీరో వెంటనే ఆ ప్రాజెక్ట్ ని ఆపేస్తాడు కానీ ఎన్టీఆర్ అలా చేయకుండా… కొరటాలతో ఏకంగా పాన్ ఇండియా సినిమానే చేస్తున్నాడు, అది కూడా ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా తర్వాత చేస్తున్నాడు అంటే తారక్ కొరటాలపై ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే కొరటాల శివ, తనలో నుంచి ఒక కొత్త రైటర్ ని బయటకి తీయాలి… మాస్ డోస్ పెంచాలి, రిపైర్లు పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలి. జనవరి నెల నుంచి ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎలాంటి డిలే లేకుండా అన్నీ షెడ్యూల్ జరిగితే… ఎన్టీఆర్ కొరటాల శివలు, 2023 దసరాకి పాన్ ఇండియా బాక్సాఫీస్ రిపేర్ చేయడానికి వస్తారు.