Ram Charan: తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. ఆ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ళకు రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా ప్రకటించాడు. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తాడని ఆ మధ్య వినిపించింది. దర్శకుడు చెప్పిన లైన్ కూడా ఎన్టీఆర్‌కు నచ్చిందని, ఇక అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని కూడా అన్నారు. ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దానికి కారణం ఎన్టీఆర్, కొరటాల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటమే. ఎన్టీఆర్‌ని దృష్టిలో పెట్టుకుని తను రెడీ చేసిన కథనే ఇప్పుడు బుచ్చిబాబు చరణ్‌తో చేస్తున్నాడని టాక్.
Read Also: Unstoppable 2: రేపే ‘అన్‌స్టాపబుల్’లో ప్రభాస్-గోపీచంద్
ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని, దీని కోసం శారీరకంగా కూడా మార్పులు అవసరం అవుతాయట. ఈ మూవీలో హీరో తన ఆటల్లో కాళ్ళు పొగొట్టుకుని అంగవైకల్యం పొందిన వ్యక్తిగా కనిపిస్తాడట. ఆ తర్వాత తను ఎలా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడన్నదే కథాంశమంటున్నారు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమా. దీనిని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించనున్నాయి. మరి బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో అనుకున్న కథని రామ్ చరణ్‌తో ఎలా ప్రేక్షకుల మెప్పు పొందేలా తీస్తాడో చూద్దాం.