ఎన్టీయార్ 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాగానే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావాల్సింది. కథానుగుణంగా ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టబోతున్నారనీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీయార్ 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నట్టు తాజా ప్రకటన వెలువడింది.…