Former Union Minister Sharad Yadav Dies At 75: ప్రముఖ సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి, జేడీయూ వ్యవస్థాపక సభ్యుడు శరద్ యాదవ్(75)కన్నుమూశారు. చాలా కాలంగా శరద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఢిల్లీలో తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని గురుగ్రామ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి శరద్ యాదవ్ అపస్మారస్థితిలోకి వెళ్లారు. పల్స్ లేకపోవడంతో సీపీఆర్ చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన…
Nitish Kumar comments on population: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ జనాభా నియంత్రణ, మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. మహిళలు చదువుకోకపోవడం, పురుషులు అజాగ్రత్తగా ఉండటం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణలోకి రావడం లేదని వ్యాఖ్యలు చేశారు. శనివారం జేడీయూ నిర్వహిస్తున్న సమాధాన్ యాత్రలో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar comments on Rahul Gandhi's Prime Ministerial candidacy: 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ధీ విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ప్రశ్నలు వస్తున్నాయి. చాలా మంది నేతలు ప్రధాని పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్, మమతాబెనర్జీ వంటి నేతలు ప్రధాని ఆశల్లో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని…
మహాత్మా గాంధీని ఎవరితో పోల్చలేమని బీజేపీ న్యూ ఇండియా విమర్శలపై మహారాష్టర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే కామెంట్స్ చేశారు. జాతి పితామహుడిని ఎవరితోనూ పోల్చలేము. బీజేపీ నవభారతం కొద్ది మంది ధనవంతులైన మిత్రుల కోసమే అని ఆరోపించారు. భారతదేశంలో చాలా మంది ఆకలితో బాధపడుతున్నారని.. మాకు కొత్త భారత దేశం అవసరం లేదని ఆయన అన్నారు. కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం వారు మోడీజీని 'నేషన్ ఆఫ్ ది నేషన్'గా మార్చాలనుకుంటే, వారిని చేయనివ్వండి. అందుకు…
కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రస్తుతం బిహార్ రాజకీయాలను వణికిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్యం తాగితే చచ్చిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో సీఎం నితీష్ తీవ్రంగా స్పందించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. 2016 నుంచి రాష్ట్రంలో మద్యం మరణాలపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నించిన బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. ‘
బీహార్ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం కాబోతున్నాయా?. రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి.. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా?
మద్య నిషేధం అమలవుతున్న బిహార్ VIP మందుబాబుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తోంది. మద్యం తాగి పట్టుబడే ప్రజాప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులను 24 గంటలపాటు అందులో ఉంచనుంది.అత్యాధునిక సౌకర్యాలన్నీ ఆ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.