జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరి నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటన మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నమేనని జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్) ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా నెగ్గింది. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుంచి మంగళవారం బిహార్ కేబినెట్లోకి మొత్తం 31 మంది మంత్రులుగా చేరారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి.
బిహార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ ప్రతిష్టాత్మక వాగ్దానానికి మద్దతు ఇస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఒక అడుగు ముందుకు వేశారు. మొత్తం ఉద్యోగావకాశాలు చివరికి రెట్టింపు అవుతాయని సూచించారు.
బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాల తర్వాత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలన్నారు. కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదంటూ భాజపా చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం బాగానే నడుస్తుందని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో బీజేపీ ఆందోళన చెందుతోందన్నారు.