Nitish Kumar comments on population: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ జనాభా నియంత్రణ, మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. మహిళలు చదువుకోకపోవడం, పురుషులు అజాగ్రత్తగా ఉండటం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణలోకి రావడం లేదని వ్యాఖ్యలు చేశారు. శనివారం జేడీయూ నిర్వహిస్తున్న సమాధాన్ యాత్రలో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Joshimath Crisis: జోషిమఠ్ ఒక్కటే కాదు.. నైనిటాల్, ఉత్తరకాశీలకు పొంచి ఉన్న ప్రమాదం
మహిలుల చదువుకుంటే సంతానోత్పత్తి రేటు పడిపోతుందని.. ఇది వాస్తవం అని.. ఈ రోజుల్లో మహిళలు చదువుకోలేకపోతున్నారని అన్నారు. మహిళలు భాగా చదువుకుని ఉంటే వారికి గర్భం నుంచి ఎలా రక్షించుకోవాలో అవగాహన ఉంటుందని.. పురుషులు అజాగ్రత్తగా ఉండటం, మహిళలు చదువుకోకపోవడం వల్ల జనాభా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. పురుషులు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించడం లేదని.. మహిళలు ఎప్పుడు చదువుకుంటారో, అప్పుడే జనాభా నియంత్రణలోకి వస్తుందని అన్నారు.
సీఎం స్థాయి వ్యక్తి ఇలా మహిళలను కించపరుస్తూ మాట్లాడటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నితీష్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని..మహిళలు చదువుకోవాలి మంచిదే కానీ పురుషుల పరువు ఎందుకు తీయాలి..? అని ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సామ్రాట్ చౌదరి కూడా నితీష్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఉపయోగించిన అసభ్యకరమైన పదాలు ఉపయోగించారు. అలాంటి పదాలను ఉపయోగించడం ద్వారా, అతను ముఖ్యమంత్రి పదవి యొక్క గౌరవాన్ని దిగజార్చుతున్నాడు’’ అని ఆయన ట్విట్టర్‌లో హిందీలో రాశారు.
मुख्यमंत्री श्री कुशासन कुमार जी ने जिन अमर्यादित शब्दों का प्रयोग किया वह संवेदनहीनता की पराकाष्ठा है। ऐसे शब्दों का प्रयोग कर वह मुख्यमंत्री पद की गरिमा को कलंकित कर रहे हैं। pic.twitter.com/d8hwU0KzkR
— Samrat Choudhary (@SMCHOUOfficial) January 7, 2023