Janata Dal United: రావడం కుదరదు.. కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Party JDU To Skip Bharat Jodo Yatra Event In Srinagar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలోనే యాత్ర ముగింపు సభను జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ ముగింపు సభకు హాజరు కావాల్సిందిగా.. ఒక్క బీజేపీని మినహాయించి మొత్తం 24 రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పంపడం జరిగింది. అయితే.. ఈ ఆహ్వానాన్ని నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) తిరస్కరించింది. అదే రోజు నాగాలాండ్‌లో తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోందని.. కాబట్టి భారత్ జోడో యాత్ర ముగింపు సభకు రావడం కుదరదని ఖర్గేకు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ లేఖ రాశారు.
Nandamuri Balakrishna: అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య
Also Read
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
“దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని.. అనియంత్రిత కార్యనిర్వాహక అధికారంపై నియంత్రణలు, సమతుల్యతలను నిర్ధారించాల్సిన రాజ్యాంగ సంస్థలు నాశనం చేయబడుతున్నాయనే రెండు అభిప్రాయాలు లేవు. నేను చారిత్రక సంఘటనకు హాజరు కావాలనుకుంటున్నాను. అదే రోజు నాగాలాండ్‌లో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు నేను హాజరుకావాల్సిన అవసరం ఉంది. కాబట్టి.. జోడో యాత్ర ముగింపు సభకు రాలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను’’ అంటూ ఆ లేఖలో రాజీవ్ రంజన్ సింగ్ పేర్కొంది. ఒకరకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఎందుకంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఐక్యమవ్వాలని అనుకున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని జేడీయూ తిరస్కరించడం.. ఆ రెండు పార్టీల మధ్య అభిప్రాయబేధాలకు తావిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!