Nitish Kumar comments on Rahul Gandhi’s Prime Ministerial candidacy: 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ధీ విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ప్రశ్నలు వస్తున్నాయి. చాలా మంది నేతలు ప్రధాని పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్, మమతాబెనర్జీ వంటి నేతలు ప్రధాని ఆశల్లో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు.
READ ALSO: KA Paul: తొక్కిసలాటపై పాల్ ఫైర్.. అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేది..
అయితే తాజాగా దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. శనివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తన మిత్రపక్షమైన కాంగ్రెస్ తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రధాని మంత్రి అభ్యర్థిగా నిలబెడితే తమకు సమస్య ఏం లేదని అన్నారు. అయితే ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే ముందు కాంగ్రెస్ సారుప్య పార్టీలను సంప్రదించాలని నితీష్ కుమార్ అన్నారు.
గతంలో బీజేపీ నేతృతంలో ఎన్డీఏలో ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ ఐదు నెలల క్రితం ఆ కూటమికి రాంరాం చెప్పింది. ఆ తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలతో చర్చల తర్వాత వారు ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలి.. ప్రస్తుతం భారత జోడో యాత్రలో కాంగ్రెస్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి పరిణామాల కోసం ఎదురు చూస్తున్నామని బీహార్ ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖలో వందలాది మంది రిక్రూట్మెంట్లకు నిమాయక పత్రాలను అందిస్తున్న సమయంలో నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.