Threat Call : హోలీ రోజు సొంత గ్రామానికి వచ్చిన యువకుడిని బీహార్‌లో మద్యం తాగనివ్వలేదు. దీంతో నేరుగా సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వ బంగ్లాను పేల్చివేస్తానని బెదిరించాడు.
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మహాగటబంధన్ కూటమి వెనక ప్రధాని ఆశలు ఉన్నాయని నితీష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి కోసమే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలిపారని ఆరోపించారు. తన ప్రధాని కలను నిరవేర్చుకునేందుకే.. బీజేపీతో…
Nitish Kumar: బీహర్ సీఎం ముఖ్య అతిథిగా హాజరైన ఓ కార్యక్రమంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగం చేస్తున్న ఓ వ్యవసాయ పారిశ్రామికవేత్తను సీఎం నితీష్ కుమార్ వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెబుతూ అమిత్ కుమార్ అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రప్రభుత్వం ‘నాలుగో వ్యవసాయ రోడ్ మ్యాప్’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పాట్నాలోని బాపు సభాగర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.
Ravi Shankar Prasad: ప్రతిపక్షాల ఐక్యతను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కూడా విపక్ష కూటమిలో చేరాలని, ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు నితీష్ కుమార్ పై విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని.. ప్రధాని కావాలనే నితీష్ కల ఎప్పటికీ…
Nitish kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ హా అన్ని ప్రతిపక్షాలు చేతులు కలపాలని కోరారు. యునైటెడ్ ఫ్రంట్ బీజేపీని 100 కన్నా తక్కువ సీట్లకు పరిమితం చేయగలదని అన్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు హాజరైన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar: తనకు ప్రధాన మంత్రి కావాలనే కోరిక లేదని అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2024లో ప్రధాని కావాలనే కోరిక లేదని.. తన కోసం నినాదాలు చేయవద్దని తన పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కోరికను బయటపెట్టారు. ఆయన కోరికను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. రోబోయే ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై తాను దృష్టిపెట్టానని నితీష్ కుమార్ అన్నారు.