కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌లు కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో నేతలు ఆమెను కలిశారు. జాతీయ రాజకీయాలు, విపక్ష పార్టీల ఐక్యతపై చర్చించినట్లు తెలుస్తోంది.
దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.
ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదని ఆయన ఓ వ్యాపారి అని లలన్ సింగ్ విమర్శించారు. పార్టీలో చేరాలని నితీష్ కుమార్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో లలన్ సింగ్ ఈ విధంగా నొక్కి చెప్పారు.
నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనే స్వయంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి విజయవాడలో పర్యటించనున్నారు.. మూడేళ్ల తర్వాత మళ్లీ విజయవాడలో అడుగుపెట్టబోతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… గతం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు కేసీఆర్.. 2019 జూన్‌లో కేసీఆర్-వైఎస్ జగన్ మధ్య సమావేశం జరిగింది.. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఏపీ సీఎం.. హైదరాబాద్‌లోనూ రెండు రాష్ట్రాల అంశాలపైన ఇద్దరు సీఎంలు, అధికారులతో…
జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రత్యేక కారణం లేదన్నారు.
Asaduddin Owaisi comments on nitish kumar, mamata banerjee: ఇటీవల ఎన్డీఏ పార్టీకి, బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు పర్యటించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారిని…
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు కోసం ప్రతిపక్ష నేతల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమావేశమయ్యారు.