Nitish Kumar criticizes Prime Minister Narendra Modi: బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ నరేంద్ర మోదీని ‘‘న్యూ ఇండియా ఫాదర్ ఆఫ్ నేషన్’’అని ప్రశంసించింది. అయితే ఈ వ్యాఖ్యలపై సెటైరికల్ గా స్పందించారు నితీష్ కుమార్. కొత్త జాతిపిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని, బీజేపీకి సంబంధం లేదని అన్నారు. న్యూ ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఇటీవల చదివానని.. దేశంకోసం కొత్త జాతిపిత ఏం చేశారు అని అడిగారు.
Read Also: Harassment: హర్యానా క్రీడా శాఖ మంత్రిపై లైంగిక వేధింపుల కేసు
మహాత్మా గాంధీని ఎవరితో పోల్చలేమని బీజేపీ న్యూ ఇండియా విమర్శలపై మహారాష్టర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే కామెంట్స్ చేశారు. జాతి పితామహుడిని ఎవరితోనూ పోల్చలేము. బీజేపీ నవభారతం కొద్ది మంది ధనవంతులైన మిత్రుల కోసమే అని ఆరోపించారు. భారతదేశంలో చాలా మంది ఆకలితో బాధపడుతున్నారని.. మాకు కొత్త భారత దేశం అవసరం లేదని ఆయన అన్నారు. కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం వారు మోడీజీని ‘నేషన్ ఆఫ్ ది నేషన్’గా మార్చాలనుకుంటే, వారిని చేయనివ్వండి. అందుకు నేను వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఇటీవల మహారాష్ట్ర నాగ్ పూర్ లో జరిగిన ఓ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ భారతదేశానికి ఇద్దరు జాతిపితలు మహాత్మాగాంధీ, నరేంద్రమోదీ ఉన్నారని.. ఒకరు భారతదేశానికి కాగా.. మరొకరు న్యూ ఇండియాకు అని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.