Supreme Court sensational comments against corrupt people: దేశంలో అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయిన కార్యకర్త గౌతమ్ నావలఖ తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా తనను జ్యుడిషియల్ రిమాండ్ నుంచి గృహ నిర్భంధంలోకి మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులు ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే గౌతమ్ నావలఖ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ జాతీయదర్యాప్తు…
Jihad literature recovered from Coimbatore car bomb accused home: తమిళనాడులో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉగ్రకోణం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు పోలీసులు గుర్తించారు. తాజాగా నిందితుడి ఇంట్లో కీలక విషయాలను గుర్తించారు. అక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుడుతో మరణించిన నిందితుడు జమేషా ముబీన్ ఇంటి నుంచి జీహాద్ కు సంబంధించిన పత్రాలను, చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.. 2024కల్లా ఉగ్రవాదమన్ని ఎదుర్కొనేందు ప్రతీ రాష్ట్రంలోనూ ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు ఏజెన్సీ) కార్యాలయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
Coimbatore Cylinder Blast: తమిళనాడు కోయంబత్తూర్ నగరంలో గ్యాస్ సిలిండర్ పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్ తీసుకుని వస్తున్న నలుగురు యువకులు వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కోయంబత్తూర్ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే…
PFI: ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మికసంస్థలు టార్గెట్గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాడులకు పాల్పడవచ్చన్న సమాచారం మేరకు ఇంటిలిజెన్స్ బృందం అప్రమత్తమైంది.
Y-category security for RSS leaders: రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్పైఐ) దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. ఎన్ఐఏ, ఈడీలు సంయుక్తంగా దాడులు చేసి పీఎఫ్ఐ కీలక నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వారివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచడంతో పాటు ముస్లిం యువతను లష్కరే తోయిబా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోందనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్, టర్కీ నుంచి…
NIA raids on PFI in 8 states: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహించింది. గత వారం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ రాడికల్ ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐపై దాడులు చేసి 106 మంది అగ్రనాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. తాజాగా మంగళవారం 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడుల చేసింది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.
PFI targeting RSS leaders: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) గురించి నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంతో పాటు ముస్లిం దేశాల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం, ముస్లిం యువతను అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటోంది పీఎఫ్ఐ. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకులను, బీజేపీ నాయకులను టార్గెట్ చేసినట్లుగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ వర్గాలు తెలిపాయి.
Petrol bomb attack on RSS leader's house in tamilnadu: తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నాయకులు ఇళ్లపై వరసగా దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మధురైలో మరోదాడి జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎంఎస్ కృష్ణన్ ఇంటిపై మూడు పెట్రోల్ బాంబులు విసిరారు దుండగులు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఘటనకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు సెర్చ్ టీంలను…