Jihad literature recovered from Coimbatore car bomb accused home: తమిళనాడులో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉగ్రకోణం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు పోలీసులు గుర్తించారు. తాజాగా నిందితుడి ఇంట్లో కీలక విషయాలను గుర్తించారు. అక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుడుతో మరణించిన నిందితుడు జమేషా ముబీన్ ఇంటి నుంచి జీహాద్ కు సంబంధించిన పత్రాలను, చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Theft In Apple Company: అట్లుంటది మనతోటి.. ఏడేళ్లుగా ఎవరికీ తెలియకుండా రూ.140కోట్లు కొట్టేసిండు
కాఫిర్లు, జీహాద్ యువకుల కర్తవ్యం-పిల్లలు మరియు వృద్ధుల కానది చూపించే చిత్రాలు, హదీస్ కు సంబంధించిన చిత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముబీన్ ఇంటిలో ఓ పలకను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ‘‘ అల్లాహ్ ఇంటిని తాకడానికి ధైర్యం చేసే ఎవరినైనా మేము నిర్మూలిస్తాము’’ అనే వ్యాఖ్యాలను గుర్తించారు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసును విచారిస్తోంది. నవంబర్ 2న ఈ కేసులో ఎన్ఐఏ మరన్ని దాడులు చేసింది.
అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటలకు కోయంబత్తూర్ లో ఓ మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్ కారు పేలుడు సంభవించింది. తొలుత సాధారణ పేలుడుగానే అనుకున్నప్పటికీ.. ఆ తరువాత ఉగ్రలింకులు బయటపడ్డాయి. ఈ పేలుడులో మరణించిన నిందితుడి ఇంట్లో పేలుడు పదార్థాలు అయిన పొటాషియం నైట్రేట్, అల్యూమినియం ఫైడర్, బొగ్గు, సల్ఫర్ వంటి వాటిని గుర్తించారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో కారులో ఎల్పీజీ సిలిండర్ ని లోడ్ చేస్తున్న నలుగురిని గుర్తించారు. మొత్తం ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమంది ఇంతకు మందు కొంత మంది కేరళ వెళ్లారని కోయంబత్తూర్ కమిషనర్ బాలకృష్ణన్ వెల్లడించారు. 2019లో ఎన్ఐఏ వీరిని ప్రశ్నించిందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పేలుడు ఘటన అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకానొక సమయంలో తమిళనాడు పోలీసులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.