Supreme Court sensational comments against corrupt people: దేశంలో అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయిన కార్యకర్త గౌతమ్ నావలఖ తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా తనను జ్యుడిషియల్ రిమాండ్ నుంచి గృహ నిర్భంధంలోకి మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులు ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే గౌతమ్ నావలఖ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరుపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. గౌతమ్ వంటి వారి వల్ల దేశం నాశనం అవుతుందని.. వారి పని అదే అని సుప్రీంకోర్టు ముందు వాదించారు.
Read Also: Twitter: భారత్‌లో కొత్తగా ట్విట్టర్ “అఫిషియల్ టిక్” ప్రారంభం..
అయితే ఆయన వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం అసలు దేశం ఎవరి వల్ల నాశనం అవుతుందో తెలుసా అంటూ అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు. ప్రభుత్వ కార్యాలయాలకు వెల్లి అక్కడ చూస్తే అవినీతి విషయాలు బయపడుతాయని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారతున్నాయని.. అయినా అవినీతిపరులపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వ్యాక్యానించింది. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్ల రూపాయాలతో బేరం ఆడుతున్న వ్యక్తుల వీడియో చూశామని గుర్తు చేసింది. అయినప్పటికీ కళ్లు మూసుకోని ఉన్నామని న్యాయమూర్తులు కామెంట్స్ చేశారు. ఇలాంటి వారు దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయడం లేదని మీరు చెబుతున్నారా..? అని ప్రశ్నించింది.
ఇలాంటి వారిని సమర్థించపోయినప్పటికీ..వారు ఉత్సాహంగా ముందుకెళ్తున్నారని వారిని బయటకు తీసుకువచ్చేందుకు డబ్బు సంచులు సాయపడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై తాము అవినీతిపరులను సమర్థించడం లేదని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని అదనపు సొలిసిటర్ జనరల్ అన్నారు. గౌతమ్ నావలఖను గృహనిర్భంధంలో ఉంచేందుకు ఎలాంచి నియమనిబంధనలు పెడతారో తెలియజేయాల్సిందిగా ఎన్ఐఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.