PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను…
Demands to ban PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు, మనీలాండరింగ్ కు పాల్పడుతుందని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ), ఈడీలు సంయుక్తంగా 15 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. 100కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘ ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి.
PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి.
ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే.. పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందనే అభియోగాలతో నిన్న (ఆదివారం) ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం,…
NIA inspections: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే.. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇక ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.…
Praveen Nettaru Case: బీజేపీ నేత ప్రవీణ్ నెట్టార మర్డర్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు జిల్లాలో విస్తృతంగా సోదాలను నిర్వహించింది. మూడు జిల్లాల్లో 33 చోట్ల సోదాలు చేశారు అధికారులు. మైసూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యులుగా ఉన్న నిందితులు.. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారును హత్య చేసినట్లు…
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్‌పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ…
Supreme Court grants bail to Varavara Rao: హక్కుల నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో వరవర రావుకు ఊరట లభించింది. అనారోగ్యం, వయసు, మధ్యంతర బెయిల్ దుర్వినియోగం చేయకపోవడవంతో శాశ్వత బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఉదయ్ లలిత్ నేత్రుత్వంలోని ధర్మాసంన అనారోగ్య కారణాల వల్ల శాశ్వత బెయిల్…
దేశంలో ఉగ్ర కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆదివారం 8 రాష్టాల్లో భారత్లో ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా దాడులు చేసింది. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.