గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
NIA, IT raids across the country: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఐటీ డిపార్ట్మెంట్లు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్- టెర్రర్ లింకులపై ఎన్ఐఏ విస్తృతంగా దాడులు చేస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని 72 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ నుంచి సరఫరా చేసిన వస్తువులను…
NIA Raids In Popular Front Of India Case: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) టార్గెట్ గా రాజస్థాన్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. రాజస్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా కోటాలో మూడు ప్రాంతాల్లో సవాయ్ మాధోపూర్, భిల్వారా, బుండి, జైపూర్ ప్రాంతాల్లో అనుమానితులు నివాస, వ్యాపార స్థలాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ పేలుళ్ల కుట్రకేసులో సినిమాను తలపించే విధంగా రహస్యాలు బయటకు వస్తున్నాయి. నగరంలో ఉగ్రవాదులు ఉండటానికి ఓ వ్యక్తి ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు గుర్తించారు.
Phulwari Sharif PFI case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పీఎఫ్ఐ ఉగ్రసంస్థ ఫుల్వారీ షరీఫ్ కేసులో మరో ఇద్దరిని బీహార్ లో అరెస్ట్ చేశారు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పిఎఫ్‌ఐకి చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన తన్వీర్ రజా అలియాస్ బర్కతి, మహ్మద్ అబిద్ అలియాస్ ఆర్యన్ అనే ఇద్దరు వ్యక్తులను మోతిహరీ ప్రాంతంలో ఎనిమిది చోట్ల దాడులు చేసి అరెస్ట్…
Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.
భాగ్యనగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్ ముఠాపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ విచారించనుంది. డిసెంబర్ 2022 నెలలో, జాహెద్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ముంబైలో బాంబు దాడికి పాల్పడతామంటూ ముంబైలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ తాలిబానీ సభ్యుడిగా పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మెయిల్ అందిందని పోలీసు వర్గాలు ఇవాళ తెలిపాయి.
Dawood Ibrahim rules Karachi airport in Pakistan, reveals NIA: అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాచమర్యాదలు పొందుతున్నాడు. కరాచీ కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ ఆధీనంలో ఉండే ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నాడని ఎప్పటి నుంచో భారత్ చెబుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతూనే ఉంది. అయితే తాజాగా కేంద్రం దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీ ఎయిర్…