NIA raids on PFI in 8 states: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహించింది. గత వారం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ రాడికల్ ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐపై దాడులు చేసి 106 మంది అగ్రనాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. తాజాగా మంగళవారం 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడుల చేసింది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.
ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 170 మంది పీఎఫ్ఐ కార్యకర్తనలు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్, నిజాముద్దీన్, జామియా నగర్ ప్రాంతాల్లో దాడులు చేసింది ఏన్ఐఏ. ఇక్కడ 30 మందిని అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులతో పాటు, ఢిల్లీ పోలీసులు, స్పెషల్ ఫోర్సెస్ ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నవంబర్ 17 వరకు జామియానగర్ ప్రాంతంలో సెక్షన్ 144 విధించారు అధికారులు. కర్ణాటకలో బీదర్, మంగళూర్, కోలార్, వజయనగర, బాగల్ కోట్, చిత్రదుర్గ, బళ్లారి, చామరాజనగర్ ప్రాంతాల్లో దాడులు చేసి 75 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Nasa: నాసా ప్రయోగం సక్సెస్.. గ్రహశకలాన్ని ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక
అస్సాం రాష్ట్రంలో గోల్ పరా, కామ్ రూప్, బార్ పేట, ధుబ్రి, బాగ్సా, దర్రాంగ్, ఉదల్ గిరి, కరీంగంజ్ జిల్లాల్లో 25 మంది పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో పూణేలో ఆరుగురు, ముంబ్రాలో ఇద్దరు, బివాండీ, కళ్యాణ్ నుంచి ఒక్కొ పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రం నుంచి 10 మందిని, మధ్యప్రదేశ్ నుంచి 21 మంది పీఎఫ్ఐ లీడర్లను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో లక్నో, బక్షి తలాబ్, ఇతౌంజా నుంచి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. దేశంతో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తోయిబా, ఆల్ ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ విచారణలో తేలింది. దీంతో పాటు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే లక్ష్యం దాడులు చేసేందకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ సంచలన విషయాలను వెల్లడించింది. దసరా సందర్భంగా జరిగే ఉత్సవాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు ఎటీఎస్ తెలిపింది.