Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.. 2024కల్లా ఉగ్రవాదమన్ని ఎదుర్కొనేందు ప్రతీ రాష్ట్రంలోనూ ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు ఏజెన్సీ) కార్యాలయాలు ఉంటాయని స్పష్టం చేశారు. గురువారం ఆయన హరియాణా ఫరియాబాద్ లో నిర్వహించిన రెండు రోజుల చింతన్ శిబిర్ సమావేశంలో మాట్లాడారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్రాలు సమష్టి బాధ్యత తీసుకోవాలన్నారు. రాజ్యాంగంలో శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర భద్రత అయితే అన్ని రాష్ట్రాలు కలిసి కూర్చొని ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించి, వాటిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తేనే సరిహద్దు నేరాలకు వ్యతిరేకంగా మనం విజయం సాధించగలం’ అని అన్నారు.
Read Also: YouTube: యూట్యూబ్తో రూ.6,800కోట్లు, 7లక్షల ఉద్యోగాలు
ప్రధాని మోడీ ప్రకటించిన పంచ ప్రాణ్, విజన్ 2047అమలుకు కార్యనిర్వహణను సన్నద్ధం చేయడానికి చింతన్ శిబిర్ ను వేదిక చేసుకున్నారు. దీనిలో సైబర్ క్రైమ్ నిర్వహణ, పోలీస్ బలగాల ఆధునీకరణ, నేర నియంత్రణ వ్యవస్థలో ఐటీ సాంకేతిక వినియోగం, భూ సరిహద్దు నిర్వహణ, తీర ప్రాంత భద్రత ఇతర అంతర్గత భద్రతా అంశాలపై చర్చకు రానున్నాయి. ఈ సదస్సులో పలు విభాగాల పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రాల హోం మంత్రులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రసంగించనున్నారు.