వన్డేల్లో నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌కు పసికూన ఐర్లాండ్ జట్టు చెమటలు పట్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లో శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (115 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (74 పరుగులు, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిన్ అలెన్ (33), కెప్టెన్ లాథమ్ (30), గ్లెన్ ఫిలిప్స్ (47)…
అన్ని విషయాల్లో పురుషులు, మహిళలు సమానమే అని చెప్తుంటారు. కానీ పాటించరు. ఉదాహరణకు క్రికెట్ విషయానికి వస్తే పురుషులకు ఒకలా.. మహిళలకు మరోలా వేతనాలు ఇస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అన్ని జట్లు పురుషులు జట్టుకు, మహిళల జట్టుకు సమానంగా వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే క్రికెట్‌లో పురుషుల క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మహిళల క్రికెట్‌కు లేదనేది జగమెరిగిన సత్యం. అయితే గతంలో కంటే మహిళల క్రికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అందుకే ఐపీఎల్…
నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును అద్భుత రీతిలో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 299 పరుగుల లక్ష్యాన్ని కేవలం 50 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఛేదించింది. దీన్ని బట్టి ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెయిర్‌స్టో టీ20 మ్యాచ్ తరహాలో ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో కొండంత లక్ష్యం కర్పూరంలా కరిగిపోయింది. 93 పరుగులకే నాలుగు వికెట్లు పడినా…
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నిన్నటిదాకా భారత్ నాలుగో స్థానంలో ఉండేది. కానీ.. పాకిస్తాన్ ఇప్పుడు భారత్‌ను వెనక్కు నెట్టేసి, ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా పాక్ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో, మొత్తంగా 106 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్ నాలుగో స్థానానికి ఎగబాకింది. టీమిండియా 105 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యింది. తొలి…
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌పై సన్‌రైజర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి మ్యాచ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది. Matthew…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పేద, ధనవంతులు, అధికారం, హోదాలు అడ్డుకాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. ప్రధానితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా ప్రధాని జెసిండాకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్ కు కరోనా…
న్యూజిల్యాండ్ బౌలర్ అజాజ్ పటేల్ గుర్తున్నాడా? క్రికెట్ ప్రియులకు కచ్ఛితంగా గుర్తుంటాడు. గతేడాది డిసెంబర్‌లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో అజాజ్ పది వికెట్లు తీసి చరిత్రపుటలకెక్కాడు. ఏ జెర్సీతో అయితే అతడు ఆ ఫీట్ సాధించాడో, ఇప్పుడదే జెర్సీని వేలం వేయబోతున్నాడు. దీని వెనుక దాగి ఉన్న ఓ చిన్న కథను కూడా అతడు రివీల్ చేశాడు గతేడాది తన కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడగా, న్యూజిల్యాండ్‌లోని స్టార్‌షిప్…
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో స్టార్ క్రికెటర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు. హామిల్టన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ 16 బంతుల్లో ఒక ఫోర్ సాధించి 14 పరుగులు చేసి అవుటయ్యాడు. టేలర్‌కు ఇది చివరి వన్డే కావడంతో అతడు అవుట్ కాగానే స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. న్యూజిలాండ్ క్రికెటర్లే కాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా రాస్…
ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెటర్లు పెళ్లిళ్లు చేసుకుని ఈ మెగా లీగ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ తన భారత ప్రేయసిని పెళ్లి చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ కూడా అతడి బాటలోనే నడిచాడు. 33 ఏళ్ల వయసులో తాను చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయాను సౌథీ పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు…
టీమిండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి చావుదెబ్బ తింది. వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడంతో పాటు అగ్రస్థానం సంపాదించింది.…