Home
New Zealand
New Zealand News
-
IND Vs NZ: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరం
IND Vs NZ: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ జట్టు స్వయంగా ప్రకటించింది. అతడి స్థానంలో పేసర్ టిమ్ సౌథీకి జట్టు పగ్గాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కేన్ విలియమ్సన్ మెడికల్ అపాయింట్మెంట్ తీసుకున్నాడని.. అయితే అదే సమయంలో మ్యాచ్ జరుగుతుండటంతో అతడు దూరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరించింది. చాలాకాలంగా విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడని..… -
IND Vs NZ: సూర్యకుమార్ సెంచరీ.. సౌథీ హ్యాట్రిక్.. గెలుపు ఎవరిదో?
IND Vs NZ: మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ (6) తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 36 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (13), హార్దిక్ పాండ్యా (13) కూడా పెద్దగా రాణించలేదు. అయితే కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో… -
IND Vs NZ: రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. శుభ్‌మన్ గిల్‌కు దక్కని అవకాశం
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు రెండో టీ20 జరగనుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే… -
IND Vs NZ: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే జరుగుతుందా? వరుణుడు సహకరిస్తాడా?
IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ 20 జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత యువ జట్టు కివీస్‌తో తలపడనుంది. టీ 20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు… -
IND Vs NZ: ఓపెనర్‌గా సూర్యకుమార్.. కివీస్‌కు చుక్కలు చూపిస్తాడా?
IND Vs NZ: వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడా? కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడా? పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. -
IND Vs NZ: నేడు న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మరోసారి సూపర్ ఓవర్లు జరుగుతాయా?
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌లో ఆడటం లేదు. సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టుకు నేతృత్వం వహిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్… -
Hardik Pandya: సెమీస్‌లో ఓటమి బాధించింది.. కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది
Hardik Pandya: ఈ నెల 18 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిపోయినందుకు నిరాశగా ఉందన్నాడు. అయితే విజయం సాధించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే… -
Pakistan Record: న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన పాకిస్థాన్
Pakistan Record: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. ఒక జట్టుపై అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కు ఇది 18వ విజయం. ఇన్ని మ్యాచ్‌ల్లో మరే జట్టు ప్రత్యర్థిపై గెలుపొందలేదు. ఇప్పటివరకు పాకిస్థాన్‌పై 17 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డు ఇంగ్లండ్‌పై ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌పై కూడా భారత్ 17 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పుడు ఆ జట్లను పాకిస్థాన్ అధిగమించి సరికొత్త రికార్డును తన… -
T20 World Cup: పాపం కేన్ మామ.. నాకౌట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఇంతేనా?
T20 World Cup: క్రికెట్లో న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. గ్రూప్ స్టేజీలో దుమ్మురేపేలా ఆడతారు. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఒక ఫోబియా ఉంటే.. న్యూజిలాండ్ జట్టుకు మరో ఫోబియా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్.. ఇలా మూడు ప్రపంచకప్‌లలోనూ న్యూజిలాండ్ బోల్తా కొట్టింది. దీంతో పాపం న్యూజిలాండ్ అనిపించక మానదు. పలువురు అభిమానులు అయ్యో… -
T20 World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్థాన్.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ చిత్తు
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్ బెర్త్ పొందిన పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు…
తాజావార్తలు
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!