New Zealand Cricket: కొత్త చరిత్రకు నాంది.. స్త్రీలు, పురుషులకు సమాన వేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని విషయాల్లో పురుషులు, మహిళలు సమానమే అని చెప్తుంటారు. కానీ పాటించరు. ఉదాహరణకు క్రికెట్ విషయానికి వస్తే పురుషులకు ఒకలా.. మహిళలకు మరోలా వేతనాలు ఇస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అన్ని జట్లు పురుషులు జట్టుకు, మహిళల జట్టుకు సమానంగా వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే క్రికెట్‌లో పురుషుల క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మహిళల క్రికెట్‌కు లేదనేది జగమెరిగిన సత్యం. అయితే గతంలో కంటే మహిళల క్రికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అందుకే ఐపీఎల్ లాంటి టోర్నీని మహిళల కోసం బీసీసీఐ ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.
Read Also: IND Vs ENG: ఐదో టెస్టులో భారత్ ఓటమి.. టెస్ట్ సిరీస్ సమం
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
కానీ చాలాకాలంగా తమకు కూడా పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని మహిళా క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా వాళ్లకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆ దిశగా ముందడుగు వేసింది. మహిళలు, పురుషుల క్రికెటర్లకు సమానంగా వేతనం ఇచ్చేందుకు న్యూజిలాండ్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల ఏళ్ల పాటు ఇరు వర్గాల క్రికెటర్లకు సమాన వేతనం ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మంగళవారం నాడు ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం అన్ని ఫార్మాట్‌లు, పోటీలకు వర్తిస్తుంది. దీంతో పురుషుల క్రికెటర్లకు ఎంత వేతనం ఇస్తున్నారో.. మహిళా క్రికెటర్లకు కూడా అంతే వేతనం లభించనుంది. అయితే ఎక్కువ సంఖ్యలో ఆడిన మ్యాచ్‌లు, ఫార్మాట్‌ల కారణంగా మహిళల కంటే పురుషులు అధికంగా సంపాదించనున్నారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!