Ross Taylor: కెరీర్ చివరి మ్యాచ్‌లో కన్నీటి పర్యంతమైన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్లో మరో స్టార్ క్రికెటర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేశాడు. హామిల్టన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ 16 బంతుల్లో ఒక ఫోర్ సాధించి 14 పరుగులు చేసి అవుటయ్యాడు. టేలర్‌కు ఇది చివరి వన్డే కావడంతో అతడు అవుట్ కాగానే స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. న్యూజిలాండ్ క్రికెటర్లే కాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా రాస్ టేలర్‌కు వీడ్కోలు పలికారు.
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రాస్ టేలర్ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం ఆలపించే సమయంలో కన్నీటి పర్యంతమయ్యాడు. జాతీయ గీతం ముగిసేదాకా కళ్లను తుడుచుకుంటూనే టేలర్ కనిపించాడు. అంతేకాకుండా క్రీజులోకి దిగే ముందు, పెవిలియన్ దారి పట్టినప్పుడు కూడా రాస్ టేలర్ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. కాగా రాస్ టేలర్ అంతర్జాతీయ వన్డేల్లో 235 మ్యాచ్‌లు ఆడి 8,588 పరుగులు సాధించాడు. వీటిలో 51 హాఫ్ సెంచరీలు, 21 సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ కెరీర్ పరంగా చూసుకుంటే 451 మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్ మొత్తం 18,213 పరుగులు చేశాడు. 40 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. వీటిలో 1,766 ఫోర్లు, 273 సిక్సర్లు ఉన్నాయి.
Also Read
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
తాజావార్తలు
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!