కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 234/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న దశలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32), పుజారా (22), అక్షర్ పటేల్ (28 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జేమీసన్ చెరో మూడు వికెట్లు…
కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు. కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతున్న అతడు తొలి ఇన్నింగ్సులో సెంచరీ సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశారు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అతడు 170 పరుగులు చేశాడు. Read Also: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీ రద్దు అరంగేట్ర…
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(1)ను న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్ (4), పుజారా (9) ఉన్నారు. మన బ్యాట్స్‌మెన్ నాలుగో రోజు ఆటలో ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్…
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75), లాథమ్ (50) ఉన్నారు. వీరిద్దరూ అర్థసెంచరీలు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 57 ఓవర్లు వేసినా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే కివీస్ 216 పరుగులు వెనుకబడి ఉంది. Read Also:…
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ రాణించాడు. 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహకారం అందించాడు. జడేజా 100 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేసి క్రీజులో…
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ మొదటి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియగా కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా… మొదట బ్యాటింగ్ ఎంచుకావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది న్యూజిలాండ్ టీం. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరుగుతోంది. అట్ల వివరాల్లోకి వెళితే… న్యూజిలాండ్ : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(సి), రాస్…
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనుండగా.. టెస్టు సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే…
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20ని కూడా మనోళ్లు వదిలిపెట్టలేదు. దీంతో కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను రోహిత్ శర్మ ప్రత్యేకంగా మలుచుకున్నాడు. కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టీ20లో 74 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను 111 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఓపెనర్ గప్తిల్ (52) మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో కివీస్ ముందు 185 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. ఓపెనర్ రోహిత్ (56) అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుతిరిగాడు. చివర్లో దీపక్…
కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవడం ఇది వరుసగా మూడో సారి. ఇప్పటివరకు రోహిత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్, అశ్విన్‌లకు రెస్ట్ ఇచ్చిన జట్టు మేనేజ్మెంట్… ఇషాన్ కిషన్, చాహల్‌ను తీసుకుంది. అటు న్యూజిలాండ్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సౌథీ…