ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రధాని మోదీకి అందించిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన బహుమతుల ఇ-వేలాన్ని ప్రారంభించింది.
Noida Towers Will Be Demolished..using 3,500 kg Explosives: నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేతకు రంగం సిద్ధం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తేలడంతో.. ఏకంగా సుప్రీంకోర్టు కూల్చేవేతకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 28న మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా సూపర్ టెక్ లోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయనున్నారు. ఇప్పటికే అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు. కూల్చివేత సమయంలో స్థానికులు దూరంగా…
Crimes against women increased in delhi: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఆడవారిపై అత్యాచారాలు, వేధింపుల కేసులు పెరిగాయి. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే.. ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగింది. ఢిల్లీలో 2022లో మొదటి ఆరు నెలల్లో 1100 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు 1480 మహిళా వేధింపుల కేసులు నమోదు అయ్యాయి
Delhi On High Alert: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వేడుకల్లో అశాంతిని సృష్టించేందుకు, అలజడి రేపేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు, దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ అయింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆగస్టు నెలలో కెనడాలో జరిగే అంతర్జాతీయ స్పీకర్ల సదస్సుకు సంబంధించి శుక్రవారం నాడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తనపై ఎప్పుడూ ఉండే విధానం ఉంటుందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం…
భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అయితే వైద్యుల సలహా మేరకు దేశ రాజధాని ఢిల్లీ శాంతినికేతన్‌లోని తన ఇంటిలో ఐసోలేషన్ ఉండి చికిత్స పొందుతున్నారు. అమర్త్యసేన్ శనివారం శాంతినికేతన్ ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. ఆయన కోల్‌కతాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు…
ఆంధ్రప్రదేశ్ లో పండిన మామిడి పండ్లను ఉత్తర భారతదేశానికి తీసుకెళ్లేందుకు వీలుగా వాల్తేర్ రైల్వే డివిజన్ ‘ మ్యాంగో ఎక్స్ ప్రెస్’ని ప్రారంభించింది. అయితే ఈ సీజన్ లో మాత్రం మ్యాంగో ఎక్స్ ప్రెస్ లేనట్టే. స్థానిక మార్కెట్ లో మంచి ధర పలుకుతుండటంతో వ్యాపారులు కూడా తమకు ఇబ్బందులు లేవని చెబుతున్నారు. అయితే బొగ్గు తరలింపుకు ప్రాముఖ్యత ఇచ్చిన రైల్వే శాఖ విజయనగరం నుంచి న్యూ ఢిల్లీ వెళ్లే మ్యాంగో ఎక్స్ ప్రెస్ రైలు సర్వీస్…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డాతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆదివారం కలిశారు. ఈ మేరకు అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన ఈటల.. కలిసి తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ స్థితిగతులను వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పలు అంశాలను చర్చించారు. సమావేశం అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అయన మీడియాతో మాట్లాడారు… తెలంగాణ రాష్ట్రంలో అధికారాని కైవసం చేసుకోవడం…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అరబ్ సమాజం కూడా ఈ వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన తెలిపాయి. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను శిక్షించాలని అంటూ శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో నిరసలు, ఆందోళనలు చెలరేగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసలు హింసాత్మకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో, యూపీ ప్రయాగలో హింసాత్మక ఘటనలు…
రాజస్తాన్ కేబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన 23 ఏళ్ల యువతిపై ఢిల్లీలో కొంతమంది దుండగులు సిరా దాడి చేశారు. సిరాను ఆమె మొహంపై వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ జిల్లా) ఈషా పాండే మాట్లాడుతూ.. శనివారం రాత్రి కొందరు దుండగులు యువతిపై ఏదో విసిరి పారిపోయారని తమకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మహిళను ఎయిమ్స్ ట్రామా…