బీజేపీ గురించి ఇతర దేశాల రాయబారులు తెలుసుకునే విధంగా ‘ బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రజాస్వామ్య దేశాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ గురించి దేశాల రాయబారులు తెలుసుకునేలా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు దేశాల రాయబారులతో సమావేశం అయ్యారు. శనివారం ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యలయలో 13 దేశాలకు చెందిన రాయబారులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. బీజేపీ చరిత్ర, అభివృద్ధి పయనాన్ని తెలిపే డాక్యుమెంటరీని రాయబారులకు ప్రదర్శించారు.…
ఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఒక్కో కార్పొరేటర్ ను పరిచయం చేసుకున్నారు ప్రధాని. 47 మంది కార్పొరేటర్లు తెలంగాణ ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని సూచించారు మోదీ. వచ్చే ఎన్నికల కోసం బాగా పని చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఒక్కో కార్పొరేటర్ తో మాట్లాడుతూ.. వారి కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. కార్పొరేటర్లుగా పనితీరు ఎలా ఉందని…
రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్ లో పార్టీ చేసుకుంటున్న వీడియోను ఈసారి బీజేపీ రిలీజ్ చేసింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుకుతూ పలు విమర్శలకు దారి తీస్తోంది. ఐఎన్‌సీ అంటే ‘ఐ నీడ్ సెలబ్రేషన్ అండ్ పార్టీ’ అంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ జాతీయ…
ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఉపహార్ థియేటర్‌లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్‌లతో మంటలు ఆర్పివేశారు. థియేటర్‌లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్‌లోని బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే 25 ఏళ్ల కిందట ఇదే థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.…
ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వచ్చిన సీఎం స్టాలిన్‌ను పలువురు వైసీపీ ఎంపీలు కలిశారు. స్టాలిన్‌ను కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డప్ప, లావు శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్య ఉన్నారు. వీరిని డీఎంకే ఎంపీ కనిమొళి సీఎం స్టాలిన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా…
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని తల్లి డింపుల్ దారుణంగా ప్రవర్తించింది. ఈ బిడ్డను హత్య చేసేందుకు వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది. అంతలోనే ముసలావిడ…
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఐఆర్‌సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన అజాతశత్రువు దివంగత ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఢిల్లీలో జరిగింది. గౌతమ్ రెడ్జి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. గౌతమి రెడ్డి మరణం వార్త అబధ్దం కావాలని కోరుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఇక లేరు. గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి,…
కొందరికి మొబైల్ చేతిలో ఉంటే చాలు… వేరే లోకం అవసరం లేదు. మొబైల్ చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలకు గురయ్యేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల శైలేందర్ మెహతా శుక్రవారం మరో చోటకు వెళ్లేందుకు షాహదారా మెట్రో స్టేషన్కు…