గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 7 నెలల తర్వాత రాజధానిలో 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. పాఠశాలల పున: ప్రారంభమైనప్పుడు పిల్లలకు కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన మధ్య పేరెంట్స్ ఉన్నారు.
గత వారంలో మూడు రోజుల పాటు ఢిల్లీ, ముంబైలో గల బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ సర్వే కార్యకలాపాల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బీబీసీని, దాని సంపాదకీయ స్వేచ్ఛను గట్టిగా సమర్థించింది.
న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న జీ20 అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్‌ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శనివారం ప్రారంభించారు.
IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది.
Payyavula Keshav: వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ ఆలోచనను తాము సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అనుసరించిన…
Earthquake: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Iron Rod: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి మృత్యువు కాటేస్తుంది. కానీ రైలులో కూర్చున్న ప్రయాణికుడికి మృత్యువు కిటికీలో నుంచి దూసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎవరి ఊహకు అందదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హరికేశ్ కుమార్ దూబే అనే వ్యక్తి విండో సీటు పక్కన కూర్చున్నాడు. తోటి ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ…
Hacking : ఢిల్లీ ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డబ్బులను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.