Amartyasen: నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అయితే వైద్యుల సలహా మేరకు దేశ రాజధాని ఢిల్లీ శాంతినికేతన్‌లోని తన ఇంటిలో ఐసోలేషన్ ఉండి చికిత్స పొందుతున్నారు. అమర్త్యసేన్ శనివారం శాంతినికేతన్ ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. ఆయన కోల్‌కతాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. జూలై 10న లండన్ వెళ్లాల్సి ఉండగా.. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని అమర్త్యసేన్ రద్దు చేసుకున్నారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రకటనలను నిలిపివేసిన వివో.. కారణం ఏంటంటే..?
Also Read
జూలై 1న శాంతినికేతన్‌లోని తన ఇంటికి అమర్త్యసేన్ వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత ఆయన ఆరోగ్యం బాగోలేదని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయన వైద్యులను సంప్రదించారని, కరోనా పరీక్షలు నిర్వహించగా, పరీక్షలో అమర్త్యసేన్ కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాగా శనివారం దేశవ్యాప్తంగా 2,693 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో దేశం మొత్తం 16,104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు సుమారు 98.51 శాతానికి పెరిగింది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!