దీపావళి అంటే బాణాసంచా.. ఇంటిల్లిపాదీ ఉదయం లక్ష్మీ పూజ చేసి రాత్రి బాణాసంచా కాల్చకపోతే పండగ పూర్తికానట్లే.. అయితే ఈసారి దీపావళికి క్రాకర్స్ ఎక్కువగా దొరక్కపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా క్రాకర్స్ పై నిషేధం విధించలేదని, పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మాత్రం ఉపయోగించవచ్చని తెలిపింది. దీపావళి కాళీ పూజల సందర్భంగా నిర్దేశించిన సమయంలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని, ఎట్టి పరిస్థితిలోను…
రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఒకపక్క సైబర్ నేరగాళ్లు ఒకలా డబ్బు గుంజుతుంటే.. మరోపక్క కొంత మంది హానీ ట్రాప్ పేరుతో డబ్బులను గుంజుతున్నారు. ఆన్ లైన్ లో అమ్మాయిల పేరుతో మగాళ్లకు వాలా విసిరి, వారిని ప్రేమ మత్తులో ముంచి, వారి నగ్న వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా న్యూ ఢిల్లీలో ఇలాంటి ఘటన సంచలనం రేపుతోంది. డేటింగ్ యాప్ ద్వారా పురుషులను రెచ్చగొట్టి, వారిని ఇంటికి పిలిచాకా బెదిరించి డబ్బులు…
దేశంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయి. కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు తగినతంగా విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదు. గతంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నాయి. అయితే కరోనా కాలంలో బొగ్గుతవ్వకాలు తగ్గిపోయాయి. దీంతో నిల్వలు తగ్గిపోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభంపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అత్యవసర…