కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డాతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆదివారం కలిశారు. ఈ మేరకు అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన ఈటల.. కలిసి తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ స్థితిగతులను వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పలు అంశాలను చర్చించారు.
సమావేశం అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అయన మీడియాతో మాట్లాడారు… తెలంగాణ రాష్ట్రంలో అధికారాని కైవసం చేసుకోవడం కోసం కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో జరుగుతున్న వియాలను ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోవాలి ఏలా మొటివేట్ చెయ్యాలి పార్టీని ఏలా ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి అనేక విషయాల మీద ఇప్పటికే కేంద్రం వద్ద ఉన్న సమాచారం సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులను మా లాంటి వారితో సమాచారాన్ని సేకరించి 2024 లో భారతీయ జనతా పార్టీని ఆధికారంలోకి తీసుకొచ్చె దిశగా అడుగులు వేస్తున్నం అన్నారు. జివో 111 పై అడిగిన ప్రశ్నకు అయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏపని కూడా ప్రజల కోసం చెయ్యడు తనకోసం చేస్తాడని తన అవసరాలకోసం చేస్తాడు కాబట్టి ఈ విషయం ఏమిటో దాని అంతరంగం ఏమిటో మునుముందు తెలుస్తుందన్నారు. తెలిపారు.
కాగా.. అమిత్ షా వ్యూహం ఏంటి.. ఈటలనే.. ఢీల్లీకి ఎందుకు పిలిపించారు. రాబోయే రోజుల్లో ఈటెలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా అనే చర్యలు కొనసాగుతున్నా నేపథ్యంలో త్వరలోనే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. ఈటలనే అమిత్ షా పిలిపించడంతో.. బీజేపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అధిష్టాన నిర్ణయం మేరకు ఈటెలకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యలు ఇస్తే.. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుందని నమ్మకంతోనే ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఇంతమంది బీజేపీ శ్రేణులు వుండగా.. ఈటలకె ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించినట్లు.. అనే అంశంపై బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
Ys Sharmila Plan: పాలేరుపై షర్మిల ఫోకస్.. లాభనష్టాల లెక్క ఏంటి?