చలి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వేశాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం నాడు అలీగఢ్, ఘజియాబాద్ మధ్య దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఆలస్యానికి కారణమైంది. Read Also: కరోనా కాలం.. ప్రతి నలుగురిలో…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. దాదాపు గంటసేపు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఏర్పాటు చేయాలనుకున్న జాతీయ రహదారికి సంబంధించిన డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, ఈ రహదారి నిర్మాణం ద్వారా విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్…
దేశ రాజధాని ఢిల్లీ గురువారం నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉండే కోర్టులో పేలుడు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారి పేలుడు చోటుచేసుకుంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విశ్లేషించారు. ఓ గదిలో ఉన్న బ్యాగులోని ల్యాప్‌టాప్ పేలిందని.. ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీలే పేలుడుకు కారణమని…
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి…
బ్యాంకులకు రుణాలు కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తాము విజయ్ మాల్యా కోసం వేచిచూడలేమని స్పష్టం చేసింది. విజయ్ మాల్యా వచ్చినా.. రాకున్నా.. జనవరి 18న శిక్షను విధిస్తామని తేల్చి చెప్పింది. Read Also: కొత్త బిజినెస్ ప్రారంభించిన ‘ఓలా’ విజయ్…
కరోనా కారణంగా గతంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వారికి మరో కష్టం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు కుటుంబాలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు వీరిని ఆదుకోవాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. Read Also: ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే వాయు కాలుష్యం కారణంగా భవన నిర్మాణ పనులు ఆపి…
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి వారం పాటు విద్యాసంస్థలు బంద్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు కూడా వారం పాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి భవన నిర్మాణ పనులు…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యంపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 13న ఢిల్లీ రావాలని పీసీసీ అధ్యక్షుడు సహా సుమారు 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది. హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ స్థాయిలో సమీక్షించనున్నట్లు సమాచారం. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే రావడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓట్ల శాతం…
భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని చైనా అన్యాయ మైన వాదనలను భారత్ అంగీకరించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చిగురువారం తెలిపారు. “దశాబ్దాలుగా చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా సరిహద్దు ప్రాంతాల్లో చైనా గత కొన్నేళ్లుగా నిర్మాణా కార్యకలాపాలను చేపట్టిందన్నారు. చైనాను దౌత్యపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతో సహా సరిహద్దు మౌలిక సదుపాయాలను కూడా భారత ప్రభుత్వం పెంచిందని విదేశీ మంత్రిత్వ…