బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అరబ్ సమాజం కూడా ఈ వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన తెలిపాయి. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను శిక్షించాలని అంటూ శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో నిరసలు, ఆందోళనలు చెలరేగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసలు హింసాత్మకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో, యూపీ ప్రయాగలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా జరుగుతున్న ఆందోళనపై జమాత్ ఉలేమా ఎ హింద్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇస్లాం ప్రకారం నుపుర్ శర్మను క్షమించాలని అధ్యక్షుడు సుహైబ్ ఖాస్మీ అన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన హింసను జమాత్ ఉలేమా ఏ హింద్ ప్రతినిధులు ఖండించారు. చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవడం లేదని అన్నారు. బీజేపీ నుపుర్ శర్మను సస్పెండ్ చేయాడాన్ని ముస్లిం ప్రతినిధులు స్వాగతించారు. రోడ్డుపైకి వచ్చి నిబంధనలను ఉల్లఘించడాన్ని మేము అనుమతించం అని చెప్పారు.
నుపుర్ శర్మ వ్యాక్యలపై ఎలాంటి హింసకు దిగవద్దని ‘ఫత్వా’ను కూడా జారీ చేస్తామని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, మహ్మద్ మదానీలకు వ్యతిరేఖంగా ఫత్వా వస్తుందని జమాత్ ఉలేమా ప్రతినిధులు వెల్లడించారు. దీంతో పాటు ముస్లిం సంస్థలు, వాటికి నిధుల సమకూర్చడంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హింసను ప్రేరేపించడాన్ని ముస్లిం సంస్థలు అనుమతించబోవని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఇటీవల ఓ టీవీ డిబెట్ కార్యక్రమంలో నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఖతార్, మలేషియా, ఇరాక్, లెబనాన్, బ్రూనై, యూఏఈ, సౌదీ వంటి అరబ్ దేశాలు భారత్ కు తమ నిరసనను తెలియజేశాయి. అయితే దీనికి సమాధానంగా భారత విదేశాంగ శాఖ.. వ్యక్తులు చేసిన ప్రకటనలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది.