బీజేపీ గురించి ఇతర దేశాల రాయబారులు తెలుసుకునే విధంగా ‘ బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రజాస్వామ్య దేశాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ గురించి దేశాల రాయబారులు తెలుసుకునేలా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు దేశాల రాయబారులతో సమావేశం అయ్యారు.
శనివారం ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యలయలో 13 దేశాలకు చెందిన రాయబారులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. బీజేపీ చరిత్ర, అభివృద్ధి పయనాన్ని తెలిపే డాక్యుమెంటరీని రాయబారులకు ప్రదర్శించారు. అనంతర దౌత్యవేత్తల ప్రశ్నలకు నడ్డా సమాధానం ఇచ్చారు. ఆస్ట్రియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, జమైకా, లిథువేనియా, మారిషస్, నేపాల్, సెర్బియా, స్పెయిన్, థాయ్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌ల రాయబారులు సమావేశంలో పాల్గొన్నారు.
పార్టీ సిద్ధాంతాలు, దేశ నిర్మాణంలో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి రాయబారులకు జేేపీ నడ్డా తెలియజేశారు. బీజేపీ మొత్తం 150 దేశాల ప్రతినిధులతో సమావేశమై పార్టీ సిద్దాంతాలను వివరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా శనివారం జరిగిన సమావేశం నాలుగోది. అంతకు ముందు జూన్ 4న ఇలాంటి సమావేశమే జరిగింది. అంతకు ముందు జూన్ 4న జరిగిన సమావేశంలో రష్యాతో సహా 7 దేశాల రాయబారులతో సమావేశం అయ్యారు ఇందులో లావోస్, క్యూబా, తజకిస్తాన్, కర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీ దేశాల రాయబారులతో సమావేశం అయ్యారు. నేటి సమావేశంతో ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్‌తో సహా 47 దేశాల రాయబారులతో సంభాషించారు. జూన్ 13న మరికొన్ని దేశాల రాయబారులతో సమావేశం జరగనుంది