Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఐఆర్‌సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి.
అంతేకాకుండా ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా కలిపే ఉంటుంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తిరుమలకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న శ్రీవారి భక్తుల కోసం మరో ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 8:35 గంటలకు పర్యాటకులు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కితే ఉ.11:30 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్లే మార్గంలోనే శ్రీకాళహస్తి ఆలయ సందర్శన ఉంటుంది. తిరుపతి చేరుకున్నాక హోటల్ గది కేటాయిస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
రెండో రోజు ఉదయం భక్తులను తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. అనంతరం చెన్నై విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రి 7:45 గంటలకు చెన్నైలో విమానం ఎక్కితే రాత్రి 10:45 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో ముగ్గురికైతే రూ.15,660, ఇద్దరికైతే రూ.15,800, ఒక్కరికైతే రూ.17,710 చెల్లించాలి.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!