బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గత నెల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్గా ఎలా మారింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి బాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఇక కరోనా ప్యాండమిక్ తరువాత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసే…
మెగా పవర్ స్టార్ రాంక్ హారం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతుండగా.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో మొదలయ్యింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు చెర్రీ. ఈ రెండింటిని పూర్తిచేయి చరణ్…
సినీలవర్స్ అందరి నోటా ఇప్పుడు ద పవర్ ఆఫ్ ద డాగ్ మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో 12 నామినేషన్స్ సంపాదించింది. అందునా ప్రధాన విభాగాలయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేషన్స్ సంపాదించింది. దాంతో అందరి చూపు…
నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్…
కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2013లో కర్నేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుండి ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించింది. తాజాగా ఆమె నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా రూ. 405 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.…
‘బాహుబలి’ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ తర్వాత టాప్ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సిరీస్ను ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్ శివగామి కథను వివరిస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇక శివగామి పాత్రలో నటించడానికి మృణాల్ ఠాకూర్ ను ఎంచుకున్నారు. కానీ కొంత చిత్రీకరణ తరువాత నెట్ఫ్లిక్స్ నిర్వాహకులు అవుట్ ఫుట్ పై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో…
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ…
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ యాక్షన్ అండ్ లవ్ డ్రామాగా రూపొందిన ‘శ్యామ్ సింగ రాయ్’కి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నాని ఇందులో ద్విపాత్రాభినయం చేయగా, సాయి పల్లవి, కృతి శెట్టి ఇందులో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు…
మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు… కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకోవడంతో పలు చిత్రాలు డబ్బింగ్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకూ మలయాళ అనువాద చిత్రాలంటే మోహన్ లాల్, మమ్ముట్టి, సురేశ్ గోపీవే! కానీ ఇప్పుడు పృధ్విరాజ్, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ చిత్రాలూ ఓటీటీలో వస్తున్నాయి. అలానే ‘వైరస్, లుకా, ఫోరెన్సిక్, కాలా’ వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరవయ్యాడు మరో మలయాళ నటుడు టివినో థామస్.…
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టి ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో…