Nag Ashwin : X-లైఫ్ ఎడిట్ చేస్తే నాగ్ అశ్విన్ వద్ద ఎడిటర్ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి బిగ్ ఆఫర్ ఇచ్చాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో ఆకట్టుకుని ‘మహానటి’ క్రేజీ డైరక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి సువర్ణ అవకాశం అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్, దీపిక ప్రధాన పాత్రల్లో సైంటిఫిక్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’ పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఔత్సాహిక ఎడిటర్స్ కి జాబ్ ఆఫర్ ప్రకటించాడు. గతేడాది నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘పిట్ట కథలు’ కోసం ‘ఎక్స్-లైఫ్’ ఎపిపోడ్ కి దర్శకత్వం వహించాడు నాగ్. ఇప్పుడు దానికి సంబంధించి ఆసక్తికరమైన ప్రోమో కట్ చేసి పంపాటలని, అలా ప్రోమోతో ఆకట్టుకున్న ఔత్సాహిక ఎడిటర్స్ కి తమ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం దక్కుతుందని చెబుతున్నాడు. నాగ్ అశ్విన్ ‘నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎక్స్ లైఫ్’లో నా పిట్టకథ గుర్తుంది కదా….దానికి సంబంధించి 2 నిమిషాల ఎడిట్ కట్ రెడీ చేయండి. అత్యుత్తమ కట్ చేసిన వారికి వైజయంతి సంస్థలో ప్రోమో విభాగంలో మీరు ఎడిటర్ ఎడిట్ అయిపోయినట్లే. అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఆల్ ది బెస్ట్’ అని సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్. మరి ఆలస్యం ఎందుకు ఔత్సాహిక ఎడిటర్స్… బెస్ట్ కట్ చేసి నాగ్ అశ్విన్ ని ఇంప్రెస్ చేయండి. ఎడిటర్ గా అవకాశం పట్టండి. ఆల్ ద బె్స్ట్.
Remember #xlife? My pittakatha on netflix…koncham overambitious and underwritten…any editors out there who can recut it, a 2min thing or even full thing…make it feel more exciting, pacy..impact..best cut will be selected for a job in the edit/promo department at Vyjayanthi.
Also Read
— Nag Ashwin (@nagashwin7) May 19, 2022
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!