విక్టరీ వెంకటేష్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. వెంకీ మామకు మాత్రం ప్రతి హీరో అభిమాని.. వీరాభిమానినే. వెంకీ మామకు హేటర్స్ ఎవరు ఉండరు. కుటుంబ కథా చిత్రాలైనా, మాస్ యాక్షన్ చిత్రాలైన ఆయనకు కొట్టినపిండి. ఇక తాజాగా వెంకీ మామ ఎఫ్ 3 చిత్రంతో మరి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత వెంకీ, ”రానా నాయుడు”లో నటిస్తున్నాడు. ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా నటించడం విశేషం.. బాబాయ్ – అబ్బాయ్ కలిసి నటించడంతో ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక తాజాగా ”ఎఫ్ 3” ప్రమోషన్స్ లో ఈ సిరీస్ గురించి వెంకీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం విశేషం. ఈ చిత్రంలో వెంకీ మామ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట.. మునుపెన్నడూ చేయని పాత్రలో వెంకీ నటిస్తున్నట్లు తెలిపారు. ఎంతో వైవిధ్యమైన కథను ఎంచుకున్నాను.. చాలా అద్భుతంగా ఉంటుంది.. నా పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉండనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి . ప్రస్తుతం ఈ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రానా- వెంకీ ల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే..