The Archies: బాలీవుడ్ నెపోటిజం.. నెట్ ఫ్లిక్స్ పై తీవ్ర దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమ అన్నాకా నెపోటిజం సాధారణమే.. ఒక స్టార్ హీరో ను పట్టుకొని వారి కొడుకులు.. మనవాళ్లు , మనవరాళ్లు వారి పిల్లలు ఇలా ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి, తాతల పేర్లు చెప్పుకొని వచ్చినా వారి గుర్తింపు వారు సంపాదించుకోకపోతే వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ నెపోటిజం బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఖాన్ లు, బచ్చన్ లు, కపూర్ లు, ఖన్నాలు ఇప్పటికే చాలామంది వచ్చారు.. ఇక నేటితరం బ్యాచ్ ను సిద్ధం చేస్తోంది బోల్డ్ లేడీ డైరెక్టర్ జోయా అక్తర్. ఆమె దర్శకత్వంలో నవ యువ నట వారసులు వెండితెరకు పరిచయమవుతున్నారు. ‘ది ఆర్చీస్’ పేరుతో ఒక వెబ్ మూవీ తెరకెక్కుతోంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ ఈ వెబ్ మూవీని ప్రెజెంట్ చేస్తోంది.
పాశ్చాత్య `ఆర్చీస్` కామిక్స్ భారతీయ వెర్షన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై విమర్శలను ఎదుర్కొంటుంది. అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్ – దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న ఈ టీజర్ ట్రోలింగ్ కు గురవుతుంది. భారతదేశంలో ఏ ప్రాంతంలో, ఏ దశాబ్దంలో టీనేజర్లు ఇలా దుస్తులు ధరించారు?.. ఒక్కరైనా ఇండియాలో ఉన్నవారిగా కనిపిస్తున్నారా..? అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. విభిన్నమైన డ్రెస్ లు, హాట్ కట్ లతో వారికి విదేశీయులుగా చిత్రీకరించి జోయా ఏం చెప్దామనుకుంటున్నాం అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్న నెట్ ఫ్లిక్స్ ను కూడా నెటిజన్స్ వదులలేదు.. ఇప్పటికే ఈ ఓటిటీ పాశ్చాత్య సంస్కృతిని ఎంకరేజ్ చేస్తోంది .. ఇది ఇలాగె కొనసాగితే నెట్ ఫ్లిక్స్ డౌన్ అవుతోంది..మీరు భారతీయ అభిరుచికి ఇక్కడి సంస్కృతి సున్నితత్వానికి సరిపోయే సిరీస్ ను రూపొందించలేకపోతే సభ్యత్వాన్ని ఆశించాల్సిన పని లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు టీజర్ తోనే ఇన్ని విమర్శలు అందుకున్న ఈ మూవీ రిలీజ్ వరకు ఉంటుందా..? లేదా అనేది చూడాలి.
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!