అమెరికన్ క్రైమ్ డ్రామా సీరిస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది ‘రానా నాయుడు’. నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మితమౌతున్న ఈ వెబ్ సీరిస్ లో మొట్టమొదటి సారి వెంకటేశ్ నటిస్తుండటం విశేషం. అలానే మొదటిసారి బాబాయ్ వెంకటేశ్ తో కలిసి ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ను ఇందులో చేస్తున్నాడు రానా. ఇల్లీగల్ వ్యవహారాలు చేసే వ్యక్తిగా రానా నటిస్తుండగా, అతని తండ్రిగా, జైలు నుండే అన్ని కార్యక్రమాలను సెట్ చేసే గ్యాంగ్ స్టర్ గా వెంకటేశ్ నటిస్తున్నారు.
‘సాక్రెడ్ గేమ్స్’ ఫేమ్ సుర్వీన్ చావ్లాతో ఈ వెబ్ సీరిస్ లో అభిషేక్ బెనర్జీ, జాను టిబ్రేవాల్, సౌరవ్ ఖురానా, అభిషేక్ భలేరావ్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ యేడాది ద్వితీయార్థంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ వెబ్ సీరిస్ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో అతి త్వరలోనే దీని ట్రైలర్ విడుదల కానుంది. కరన్ అన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరిస్ రచనలో తెలుగువాడైన బీవీయస్ రవి సైతం భాగస్వామిగా ఉన్నాడు.