పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ నుంచి వచ్చిన ట్రిపుల్ ఆర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే ఓటిటిలో నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. అయితే తెలుగులో భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్యకు.. థియేటర్లోనే కాదు, ఓటిటిలో కూడా భారీ ఎదురుదెబ్బే పడిందట. మరి ట్రిపుల్ ఆర్ ఓటిటిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఆచార్య పరిస్థితి ఎలా ఉంది..?
దర్శక ధీరుడు తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా.. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా.. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. 1200 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి.. వండర్స్ క్రియేట్ చేసింది. అయితే థియేటర్లో దుమ్ము దులిపిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటిటిలో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంటోంది. సౌత్ భాషల్లో జీ 5లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా జీ 5లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోందని… ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ లోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోందని జీ5 ప్రకటించింది. అలాగే 1000 మిలియన్ మినిట్ వ్యూస్ కి పైగా రాబట్టి.. భారీ రెస్పాన్స్ తో అదరగొడుతుందని చిత్ర బృందం మరియు జీ 5 అనౌన్స్ చేసింది. దాంతో ఇంత భారీ రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్‌కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసారు. అయితే ట్రిపుల్ నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంటే.. మెగాస్టార్ ఆచార్య ఓటిటి పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని తెలుస్తోంది. థియేటర్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఆచార్య.. కనీసం ఓటిటిలో అయినా ఆదరణ దక్కించుకుంటుందేమో అనుకున్నారు. కానీ ఓటిటిలో కూడా ఆచార్య చిత్రానికి ఆదరణ లేదని టాక్. అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన.. ఈ చిత్రాన్ని చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదట. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూసి.. ఆచార్యను అస్సలు పట్టించుకోవడం లేదట. ఈ మధ్య కాలంలో అటు థియేటర్లో.. ఇటు ఓటిటిలో భారీగా దెబ్బతిన్న సినిమాగా ఆచార్య నిలిచిపోయిందని అంటున్నారు.