కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2013లో కర్నేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుండి ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించింది. తాజాగా ఆమె నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా రూ. 405 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.…
‘బాహుబలి’ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ తర్వాత టాప్ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సిరీస్ను ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్ శివగామి కథను వివరిస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇక శివగామి పాత్రలో నటించడానికి మృణాల్ ఠాకూర్ ను ఎంచుకున్నారు. కానీ కొంత చిత్రీకరణ తరువాత నెట్ఫ్లిక్స్ నిర్వాహకులు అవుట్ ఫుట్ పై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో…
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ…
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ యాక్షన్ అండ్ లవ్ డ్రామాగా రూపొందిన ‘శ్యామ్ సింగ రాయ్’కి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నాని ఇందులో ద్విపాత్రాభినయం చేయగా, సాయి పల్లవి, కృతి శెట్టి ఇందులో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు…
మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు… కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకోవడంతో పలు చిత్రాలు డబ్బింగ్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకూ మలయాళ అనువాద చిత్రాలంటే మోహన్ లాల్, మమ్ముట్టి, సురేశ్ గోపీవే! కానీ ఇప్పుడు పృధ్విరాజ్, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ చిత్రాలూ ఓటీటీలో వస్తున్నాయి. అలానే ‘వైరస్, లుకా, ఫోరెన్సిక్, కాలా’ వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరవయ్యాడు మరో మలయాళ నటుడు టివినో థామస్.…
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టి ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో…
కరోనా పుణ్యమా అని ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. సినిమా థియేటర్లు తెరిచినా ఓటీటీలు ఉన్నాయి కదా అని చాలా మంది వెళ్లడం లేదు. దీంతో పలు ఓటీటీ సంస్థలు ఛార్జీలు పెంచే పనిలో పడ్డాయి. తాజాగా అమెజాన్ సంస్థ ప్రైమ్ మెంబర్షిప్ ఛార్జీలు భారీగా పెంచింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఓటీటీ ప్రియులకు ఓ వైపు అమెజాన్ షాక్ ఇవ్వగా.. నెట్ఫ్లిక్స్ ఇండియా మాత్రం గుడ్న్యూస్ చెప్పింది. Read Also: గుడ్న్యూస్ చెప్పిన…
ప్రపంచంలోని అత్యంత అత్యాధునిక, వినూత్నమైన వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో ఒకటైన జర్మనీకి చెందిన స్కాన్లైన్ వీఎఫ్ఎక్స్ను కొనుగోలు చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. కంటెంట్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్కాన్లైన్ “స్ట్రేంజర్ థింగ్స్” “కౌబాయ్ బెబాప్”తో సహా అనేక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్లపై ఈ స్టూడియో పని చేసింది. అనేక మార్వెల్, డీసీ టైటిల్స్ కోసం స్కాన్లైన్ స్టూడియో వైవిధ్యమైన ఎఫెక్ట్స్ ను అందించింది. 1989లో స్థాపించబడిన స్కాన్లైన్కి వాంకోవర్, మాంట్రియల్,…
కరోనా కారణంగా చాలా సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడిపోయింది. కొన్ని సినిమాలు షూటింగ్లు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. షూ టింగ్లు పూర్తి చేసుకున్నా విడుదలకు నోచుకుని సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. కొన్ని సినిమాలు థియేట్రికల్ రీలీజ్ను స్కిప్ చేసి ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఇంకొన్ని సినిమాలయితే అసలు ఓటీటీలో విడుదల చేయాల..? లేక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడాలా అనే విషయంలో ఇప్పటికి డైలామా స్థితిలోనే ఉన్నాయి. అందులో ఒకటి విరాటపర్వం సినిమా.. దగ్గుబాటిరానా, సాయిపల్లవి…
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి నెట్ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని అఖిల్ కెరీర్లో తొలి హిట్ మూవీ ఇదే. Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ…