లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో #HBDNayanatara అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నయన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” మేకర్స్ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో…
(నవంబర్ 18న నయనతార పుట్టినరోజు)నయనతార అందంలో అయస్కాంతముంది. అభినయంలో అంతకు మించిన ఆకర్షణ ఉంది. ఏ తీరుగ చూసినా నయనతార అందాల అభినయం నయనానందం కలిగిస్తుంది. నయనతారను ఈ తరం వారి సీతమ్మ అని చెప్పవచ్చు. అలాగే నిర్మాతల పాలిటి లక్ష్మీ అని భావించవచ్చు. సౌత్ లో నంబర్ వన్ నాయికగా తన తీరే వేరంటూ సాగుతోంది నయన్. తాను నటించిన సినిమాల ప్రచారపర్వంలో పాలు పంచుకోవడానికి నయన్ అంత సుముఖత చూపించరు. ఆమె పెట్టే షరతులను…
సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా తన అభిమానులను అలరించబోతోందట. ఇటీవల షూటింగ్ ప్రారంభించిన షారుఖ్ ఖాన్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది నయన్. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “లయన్” అనే టైటిల్ పెట్టారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో నటించనుందని టాక్. ఆ పాత్రకు నయనతారనే…
చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని వచ్చిన సమంత వృత్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన చేస్తున్న సమంత తాజాగా షారూఖ్, అట్లీ సినిమాలోనూ నటించబోతోందట. ఇందులో నయనతార స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందు సమంతనే అనుకున్నాడు అట్లీ. అయితే అప్పట్లో సంసారజీవితంలో బిజీగా కావాలనుకున్న సమంత ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత అట్లీ షారూఖ్ సరసన నయనతారను హీరోయిన్…
లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ వరుసగా తీర్థయాత్రలు చేస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఇటీవలే తిరుమల శ్రీవారిని సేవించుకున్నారు. అనంతరం ముంబైలోని మహాలక్ష్మి ఆలయం, సిద్ధి వినాయక్ ఆలయాన్ని సందర్శించారు. తాజాగా షిరిడీ చేరుకుని సాయిబాబా ఆశీర్వాదం పొందారు. కొంతకాలం క్రితం తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఓ షోలో ప్రకటించిన నయన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నయనతార ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తన…
దాదాపు ఏడేనిమిదేళ్ళ క్రితం తీసిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎట్టకేలకు శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘మస్కా’ తర్వాత బి. గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తాండ్ర రమేశ్ నిర్మించారు. మూడు నాలుగేళ్ళుగా ఈ సినిమా ఇదిగో వస్తోంది, అదిగో వస్తోందంటూ నిర్మాత ప్రచారం చేశారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. అందుకు సంతోషపడాలి. శివ (గోపీచంద్) బెజవాడలో పుట్టి, హైదరాబాద్ లో పెరుగుతాడు. పెద్దగా చదువు అబ్బదు. ప్రభుత్వ అధికారి అయిన అతని…
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.…
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవలే ప్రైవేట్ వేడుకలో తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా ప్రకటించి వార్తల్లో నిలిచింది. తాజాగా మరోమారు ఆమె ఓ బేబీని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఉండగా, నయన్ బేబీని ఎత్తుకుంది. దాంతో అసలు ఆ బేబి ఎవరు అనే ప్రశ్న అభిమానులను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె అభిమానులు ఈ బేబీ ఎవరై ఉంటారబ్బా !? అనే…
సత్యదేవ్ కెరీర్ మంచి జోరుమీదుంది. కరోనా టైమ్ లో పూర్తి స్థాయిలో లాభపడిన హీరో ఎవరంటే ఖచ్చితంగా సత్యదేవ్ పేరే వినపడుతుంది. ఇటీవల ‘తిమ్మరుసు’తో మరోసారి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా సీతాకాలం, గాడ్సే’ వంటి తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో ‘రామ్ సేతు, స్కైలాబ్’ సినిమాలు చేస్తున్నాడు. వీటన్నింటికి మించి చిరంజీవి నటిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్ లో సత్యదేవ్ విలన్ గా కనిపించబోతుండటం అతని కెరీర్ కి పెద్ద టర్నింగ్…
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన “నేత్రికన్” మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కన్పించి మెప్పించింది. సిబిఐ ఆఫీసర్ అయిన హీరోయిన్ ఒక యాక్సిడెంట్ లో అనుకోకుండా తన తమ్ముడితో పాటు కళ్ళు పోగొట్టుకుంటుంది. మళ్ళీ ఆపరేషన్ ద్వారా కళ్ళు తెచ్చుకోవడానికి తిరిగి ప్రయత్నిస్తుంటుంది. ఓ సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటాడు. కళ్ళు లేని హీరోయిన్ ఆ సైకో ఆటలు ఎలా కట్టించింది ? అనేదే కథాంశం.…